యూపీఏ ప్రభుత్వం మైనారిటీల విషయంలో అతి వినయం ప్రదర్శిస్తే... ఎన్డీయేలోని పక్షాలు అనవసరమైన అతిని చేస్తున్నాయి. సున్నితమైన అంశాల గురించి సరిగా వ్యవహరించకుండా విమర్శల పాలువుతున్నారు. రంజాన్ ఉపవాసంలో ఉన్న వంటమనిషికి చపాతీ తినిపించి శివసేన ఎంపీలు అనవసర రాద్ధాంతానికి కారణం అయ్యారు. పార్లమెంటులో ఈ అంశం గురించి చర్చకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై ఎలా స్పందించాలో కూడా మోడీ సర్కార్ కు అంతుబట్టకుండా పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి గల కారణాల్లో ఆ పార్టీ మైనారిటీల విషయంలో వ్యవహరించిన తీరు కూడా ఒకటి. మైనారాటీ లపై ఓట్ల రాజకీయాలను తీవ్రం చేసింది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో మైనారిటీల సంక నాకడానికి కాంగ్రెస్ వాళ్లు ప్రాధాన్యతను ఇచ్చారు. అలా చేయడం వల్ల ముస్లిం ఓట్లన్నీ తమకే పడతాయని... సహజమైన ఓటు బ్యాంకు కలిసి వస్తే.. తమదే అధికారం అవుతుందని కాంగ్రెస్ లెక్కలేసుకొంది. అయితే చివరకు జరిగింది వేరు. చాలా మంది ముస్లింలే కాంగ్రెస్ అవినీతి పాలనను మెచ్చలేదు. దీనికితోడు మైనారిటీలకు అతి ప్రాధాన్యాతను ఇచ్చినట్టుగా, దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేదిలా కనిపించిన యూపీఏపై మెజారిటీప్రజలు కక్ష తీర్చుకొన్నారు. తమ ఓటు ద్వారా కాంగ్రెస్ ను గద్దె దించారు. బీజేపీ వాళ్లు సరైన లౌకిక విధానాలను అనుసరించగలరన్న నమ్మకంతో వీళ్లను ఎన్నుకొన్నారు. మోడీ సర్కార్ భారత లౌకిక విధానాలను నిలబెడుతుందని ప్రజలు నమ్ముతున్నారు. అయితే అక్కడక్కడ ఇలాంటి అతి చేష్టలు మాత్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలను తీసుకొచ్చేవే. ఎన్డీయేలో భాగస్వామి అయిన శివసేన ఎంపీలు ఇలాంటి వ్యవహరించకుండా ఉండాల్సింది. దీనివల్ల అపప్రద తప్పవచ్చేది ఏమీ లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: