మేము గెలిస్తే నియోజకవర్గంలోనే మకాం పెడతాం..అనేది సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే వాళ్లు ఇచ్చే తొలి హామీ. సినిమా వాళ్లు తమ వృత్తిరీత్యా ఎక్కడో కాపురం ఉంటారు. తమ పనుల్లో తాము బిజీగా ఉంటారు. వయసు మీద పడినప్పుడుప్రజాసేవ కోసం అంటూ రాజకీయాల్లోకి వస్తారు. ఇటువంటి తరుణంలో ప్రజల్లో నమ్మకం కలిగించడానికి చాలా కబుర్లే చెబుతున్నారు. నియోజకవర్గంలో ఇళ్లను కట్టుకొంటాం.. ఇక్కడే కాపురం చేస్తాం.. అంటూ ప్రజలకు హామీ ఇస్తారు. తీరా గెలిచిన తర్వాత మాత్రం వాళ్లు కళ్లకు కనపడరు. ఇలాంటి వారిలో ఒకరిగా ఇప్పుడు డ్రీమ్ గర్ల్ హేమమాలినీ పేరు మార్మోగుతోంది. ఆమె మధుర నియోజకవర్గం నుంచి ఎంపీగావిజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ ఎంపీగా గెలిచింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు రెండు నెలలు పూర్తియన నేపథ్యంలో చూస్తే.. హేమమాలినీ నియోజకవర్గంపై దృష్టి సారించిందే లేదట! అసలు గెలిచిన తర్వాత మళ్లీ ఆ ఏరియాకు వచ్చిందే లేదట! దీంతో ఆమె ప్రత్యర్థులు ఈ పరిణామాలను ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. హేమమాలినీ కనిపించుట లేదు.. అంటూ మధురలో పోస్టర్లు అతికించడం మొదలు పెట్టారు. ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె ఢిల్లీలోనో, ముంబైలోనో మకాం పెట్టేసింది.. మాకు ఎంపీ లేదంటూ వాళ్లు వీధుల్లో పోస్టర్లు అతికించారు. మరి అప్పుడే అంత అవకాశం ఇచ్చింది అంటే... హేమమాలినీ తీరు ఏమిటో అర్థం చేసుకోవచ్చు! ఆమె మాత్రమే కాదు... మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన చాలా మంది సినీస్టార్లు తమ నియోజకవర్గాలపై పెద్దగా దృష్టిపెట్టిందేమీ లేదని తెలుస్తోంది. ఉదాహరణకు మన బాలయ్య బాబును తీసుకొన్నా... "లెజెండ్'' వంద రోజుల వేడుకకు హిందూపురం వెళ్లడమే తప్ప.. నియోజకవర్గ స్థాయిలో పర్యటించింది లేదని తెలుస్తోంది. అయినా ఇది పెద్ద విశేషం కూడా కాదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: