'ఆధార్‌' పైన యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ నందన్‌ నీలేకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించారంటున్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీని కూడా ఒప్పించారంటున్నారు. నాలుగు రోజుల క్రితం మోడీ ఆధార్‌కు అనుకూలంగా ప్రకటన చేశారు. నీలేకని.. మోడీ, జైట్లీలతో భేటీ అనంతరమే ఇది జరిగింది. యూపీఏ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నగదు బదిలీ పథకానికి కీలకం ఆధార్‌ కార్డులు. అయితే వీటి జారీ ప్రక్రియ పూర్తి కాకముందే యూపీఏ పాలన పగ్గాలను వదిలేయాల్సి వచ్చింది. యూపీఏ పథకాలపై అప్పటికే పలు సందర్భాల్లో విమర్శల వర్షం కురిపించిన బీజేపీ అధికారం చేపట్టింది. దీంతో ఇక ఆధార్‌కు కాలం చెల్లిపోయినట్టేనని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఆధార్‌ కార్డుల జారీ సంస్థకు యూపీఏ కేటాయించిన బడ్జెట్‌ మరింత పెరిగిందే తప్ప పైసా కూడా తగ్గలేదు. ఆధార్‌ పైన మోడీని నీలేకని మెప్పించి మళ్లీ ఆధార్‌ కార్డులకు జీవం పోశారు. ఆధార్‌ అంశానికి సంబంధించి ఆన నేరుగా ప్రధానిని కలిశారు. కార్డుల ప్రాధాన్యాన్ని, నగదు బదిలీ ఆవశ్యకతను వివరించారు. నీలేకనీ వాదనతో మోడీ ఏకీభవించడంతో పాటు జైట్లీని కలవమని చెప్పారట. నీలేకనీ... జైట్లీతో సమావేశమయ్యారట. మొన్నటి బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ)కి అంతకుముందు పేర్కొన్న రూ. 1,550 కోట్ల కేటాయింపులు రూ.2,039 కోట్లకు పెరిగింది. ఇక ఆధార్‌ కార్డులను రద్దు చేయడం సాధ్యం కాదని విశ్లేషలుకు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: