కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాయబరేలీలో ఆమె ఎన్నికను ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. రాయబరేలీకి చెందిన రమేష్ సింగ్ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ పిటిషన్ వేశాడు. విచారణ చేసిన తరుణ్ అగర్వాల్ బెంచ్ ఆమెకు నోటీసులు పంపింది. తర్వాతి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. దీనికి సంబంధించి సాక్ష్యాలను, డాక్యుమెంట్లు అందించాలని కోర్టు నోటీసులు అందించింది. సోనియా గాంధీ కూడా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలను కోర్టుకు చెప్పాలని నోటీసులో చెప్పారు. ఆమె ఎన్నిక గురించి మాట్లాడుతూ ఆమె ఇటలీకి చెందిన సిటిజన్ అని..ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేశాక..ఢిల్లీ జామా మసీద్ కు చెందిన అహ్మద్ బుకారే కాంగ్రెస్ కు మద్దతిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారని..దీంతో ఆమె ఎన్నికల్లో గెలిచిందని పిటిషనర్ కోర్టుకు చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్దమని ఆయన అన్నారు. వెంటనే ఆమె ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశాడు పిటిషనర్.

మరింత సమాచారం తెలుసుకోండి: