ఆగష్టు 1న జరగబోయే ‘రభస’ ఆడియో ఫంక్షన్ లో యంగ్ టైగర్ అభిమానులకు జూనియర్ అనుకోని గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. గత మూడురోజుల క్రితం జూనియర్ కు పుట్టిన లిటిల్ జూనియర్ ఎలా ఉంటాడు అన్న ఆత్రుత జూనియర్ అభిమానులకు రోజురోజుకు పెరిగిపోతు ఉండటంతో ఆ ఆతృతను దృష్టిలో పెట్టుకుని జూనియర్ ‘రభస’ ఆడియో వేడుక వేదికగా తన జూనియర్ బుడ్డోడుని నందమూరి అభిమానులకు చూపెట్ట బోతున్నాడు అని టాక్. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘రభస’ ఆడియో వేడుకలో జూనియర్ తన కొడుకు ఫోటోను ఆరోజు అందరి ఎదుట స్క్రీన్ పై చూపెట్ట బోతున్నాడు అని తెలుస్తోంది. అంతేకాకుండా జూనియర్ తారక్ కోసం ఎన్టీఆర్ ఎంపిక చేసిన పేరును కూడా ఆరోజు జూనియర్ ప్రకటిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. నందమూరి తారక రామారావు పేరు కలిసే విధంగా జూనియర్ బుడ్డోడి పేరు ఉంటుందని టాక్. జూనియర్ కెరియర్ కు సంబంధించి టర్నింగ్ పాయింట్ గా మారిన ‘రభస’ సినిమాను మన జూనియర్ బుడ్డోడు పుట్టడంతో ఏస్థాయి బ్లాక్ బస్టర్ గా మారుతుందో చూడాలి. ఈ వార్తలు ఇలా ఉండగా ‘రభస’ ఆడియో ఫంక్షన్ పూర్తి అయిన వెంటనే పూరి జూనియర్ల కొత్త సినిమాకు పూరి కొత్త ఇల్లు ‘కేవ్’ లో ముహూర్తపు షాట్ చిత్రీకరిస్తారని వార్తలు వస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: