ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కార్యకర్తలు... రుణమాఫీ అనేది ఒక అయిపోయిన అంకం అని అంటున్నారు. రుణమాఫీ జరిగిపోయిందని అంటున్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించనక్కర్లేదని స్పష్టం చేస్తున్నారు. క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం అయిపోయిందని తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా రుణమాఫీ చేశాను చూశారా అంటున్నారు! అయితే ఇటువంటి తరుణంలో బ్యాంకర్లు మాత్రం ఇంకా అలాంటిదేమీ లేదని చెబుతుండటం విశేషం! రుణమాఫీ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం అందించలేదని బ్యాంకర్లు స్పష్టంగా చెబుతున్నారు. రుణమాఫీ జరిగిందని ఎవరైనా అనుకొంటే అనుకోవచ్చేమో కానీ... సాంకేతికంగా మాత్రం ఒక్క రూపాయి కూడా రుణమాఫీ అయినట్టు తాము ప్రకటించలేమని.. రైతులకు క్లియరన్స్ గా ఎలాంటి సర్టిఫికెట్లు కానీ , పత్రాలను కానీ వెనక్కు ఇవ్వలేమని చెబుతున్నాయి! ప్రభుత్వం , తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు! మరి ఇప్పుడు రుణమాఫీ జరిగినట్టో.. జరగనట్టో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకవైపు క్యాబినెట్ లోనేమో... రైతులకు లక్షన్నర, డ్వాక్రా మ హిళలకు లక్షల రూపాయల పరిమితితో రుణమాఫీ అని చెప్పారు. బాబు అయితే.. ఇంకో అడుగు ముందుకేసి.. రుణమాఫీ చేసి చూపించానని అంటున్నాడు. అయితే ఇప్పటి వరకూ రైతులకు తనఖాలో ఉన్న పత్రాలు చేతికందలేదు.. మహిళలకు బంగారం చేరలేదు... డ్వాక్రా రుణాలు రద్దయ్యాయనే ఎలాంటి హామీ కూడా లభించలేదు! అసలుకు ఇవన్నీ ఎప్పటికి జరుగతాయి? అనే విషయం గురించి రైతులకు క్లారిటీ లేదు! ప్రభుత్వం కూడా అధికారికంగా తేదీలను ప్రకటించలేదు. ఈ పరిస్థితి గురించి బ్యాంకర్లు స్పందించడం ఆసక్తికరంగా మారింది. తమకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు, రుణమాఫీ గురించి గానీ, రీషెడ్యూల్ గురించి ప్రభుత్వం మమ్మల్ని స్పందించలేదని వారు చెబుతున్నారు. మరి తెలుగుదేశం కార్యకర్తలేమో అప్పుడే బాబును దేవుడని అంటున్నారు! బాబును కీర్తిస్తూ పాటల సీడీలు కూడా తీసుకొచ్చారు.. మరి ఏంటో అంతా గందరగోళం!

మరింత సమాచారం తెలుసుకోండి: