ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానికి సంబంధించి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డుతో భేటీ కానుంది. అంతకు ముందు ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజధాని సలహా కమిటీతో కూడా భేటీ అవుతుంది. ఉ.9గం.కు సలహా కమిటీతోను, 11గం.కు లేక్‌వ్యూ అతిథి గృహంలో ముఖ్యమంత్రితోనూ శివరామకృష్ణన్‌ కమిటీ భేటీ అవు తుంది. శివరామకృష్ణన్‌ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోగా, కమిటీలోని సభ్యులైన రతన్‌రాజ్‌, జోషిలు ఉదయమే హైదరాబాద్‌ కు చేరు కున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శివరామకృష్ణన్‌ కమిటీ పర్యటించింది. రాజధానికి అనుకూలమైన ప్రాంతాలు, పరిస్థితులను పరిశీ లించింది. మధ్యంతర నివేదికను సైతం కమిటీ సిద్ధం చేసినట్లు సమాచారం.  శనివారం హైదరాబాద్‌లో సిఎంతో భేటీ అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్లి పూర్తి స్థాయి నివేదిక రూపకల్పనపై కసరత్తు చేయ నుంది. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్న ప్రదే శాన్నే ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్‌ వస్తోంది. త్వర లోనే ఈ నివేదికను కమిటీ కేంద్రానికి సమ ర్పించ నుంది. కమిటీ నివేదిక అనంతరం కేంద్రం రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసేది ప్రకటించనుంది. ఈ పూర్వ రంగంలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని సలహా కమిటీ అన్ని శాఖల ఉన్నతాధి కారులతో సమావేశాలను నిర్వహిస్తోంది. ఆయా శాఖల నుండి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను తీసు కుంటోంది.  ఏయే ప్రాంతాలు రాజధానికి అను కూలంగా ఉన్నాయి, ఎక్కడ ఏర్పాటు చేస్తే అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి తదిరాలన్నింటినీ అధికారులు సలహా కమిటీకి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీలో సభ్యులుగా రాజ్య సభ సభ్యులు యలమంచిలి సుజనా చౌదరి, లోక్‌సభ సభ్యులు గల్లా జయదేవ్‌, మాజీ శాసన సభ్యులు బి.మస్తాన్‌ రావు, జివికె గ్రూప్‌ వైస్‌ఛైర్మన్‌ జీవి సంజ రు రెడ్డి, జి ఎమ్మార్‌ గ్రూప్‌ సభ్యులు బొమ్మడాల శ్రీనివాస్‌, నూజివీడు సీడ్స్‌ ఛైర్మన్‌ ఎం.ప్రభాకర్‌ రావు, పీపుల్స్‌ కేపిటల్‌ చైర్మన్‌ చింతలపాటి శ్రీనివాస రాజు (శీని రాజు) ఈ కమిటీలో ఉన్నారు. మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: