తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య స్థానికత ఇష్యూ ఎంత పెద్ద వివాదం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే.. స్థానికత మీద ఇతర రాష్ట్రాలు, కేంద్రం చెబుతున్న నిర్వచనాలకు భిన్నంగా కేసీఆర్ సర్కారు 1956 గీటు రాయి వాడటంతో ఇది పెనువివాదమై కూర్చొంది. వాస్తవానికి ఈ స్థానికత నిబంధనను కేసీఆర్ సర్కారు ఫీజు రీఎంబర్స్ మెంటు పథకానికి మాత్రమే వర్తింపజేస్తోంది. కానీ ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని.. ఈ విషయంలో జనం నోరు మూసుకుని కూర్చుంటే.. అన్ని పథకాలు.. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ దీన్నే గీటురాయిగా చేసుకుంటారన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ స్థానికత అంశంపై ఏపీ సర్కారు దీటుగానే పోరాడుతోంది. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. న్యాయపోరాటానికి కూడా సిద్ధమైంది. తెలంగాణలో చదవుకుంటున్న ఏపీ విద్యార్థులకు ఫీజులు కట్టడం తమకు భారం కాబోదని.. కానీ దేనికైనా ఓ పద్దతంటూ ఉండాలని వారు వాదిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఘాటుగా స్పందించారు. ఏడేళ్లు ఎక్కడ చదివితే అక్కడి స్థానికత వస్తుందని కేంద్ర నిబంధనలు వర్తిస్థాయని దీన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. అంతేకాదు.. కేసీఆర్ విధిస్తున్న 1956 నిబంధన అర్థరహితమన్నారు. ఈ నిబంధన సరిగ్గా వర్తింపజేస్తే.. అసలు కేసీఆరే స్థానికుడు కాదంటూ మరో విమర్స చేశారు. ఈ మాటలు ఎవరో చిన్నాచితకా లీడరో అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏపీ హోంమంత్రి హోదాలో ఉండి.. పక్కరాష్ట్రం సీఎం గురించి అంత తేలిగ్గా ఎలా మాట్లాడతారు. ఏదో ఆధారం ఉండే ఉండాలేమో.. అందులోనూ కేసీఆర్ కుటుంబం విజయనగరం నుంచి వలస వచ్చిందని ఓ వాదన ప్రచారంలో ఉంది. దాని ప్రకారమే చిన రాజప్ప ఈ వాఖ్యలు చేశారా.. దీనిపై గులాబీనేతలు ఎలా స్పందిస్తారో.. చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: