ప్రముఖ బ్యాట్‌మెంటిన్ సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులు కావడం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి)లో ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య వివాదానికి దారితీసింది. సానియా మీర్జాకు కోటి రూపాయలు ఇవ్వడం, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడాన్ని ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సానియా పాక్ కోడలుగా ఉన్నారని బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన గుర్తు చేశారు. కాగా విహెచ్ వ్యాఖ్యల పట్ల టి.పిసిసి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం వంద శాతం సమంజసంగా ఉందని అన్నారు. ఆమె అనేక పథకాలు సాధించిందని ఆయన తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన విహెచ్‌పై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. విహెచ్‌కు వాక్ స్వాతంత్య్రం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. విహెచ్‌ను కట్టడి చేయాల్సిందిగా ఆయన ఆ లేఖలో కోరారు. ఇలాఉండగా షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలపై విహెచ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. బెంగళూరులో ఉన్న విహెచ్ శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ తాను తప్పేమి మాట్లాడలేదని అన్నారు. తెలంగాణలో జన్మించిన అజహరుద్దీన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించకుండా, ముంబాయిలో జన్మించిన సానియాకు ఎలా ఇస్తారని ప్రశ్నించానని చెప్పారు. యోధానుయోధులు ఉన్న పార్లమెంటు అఫైర్స్ కమిటీ (పిఎసి)లో తనను సభ్యునిగా నియమించడాన్ని జీర్ణించుకోలేని ఒక ఎంపి ఇలా షబ్బీర్‌అలీతో మాట్లాడించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: