తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంకా హైదరాబాద్ గురించే మాట్లాడటంపై, ఇక్కడ నుంచే పాలనను సమీక్షిస్తుండటంపై విమర్శల వాన తీవ్రం అవుతోంది. ఎలాగూ హైదరాబాద్ సీమాంధ్రది కాదని తెలిసిపోయింది. పదేళ్ల వరకూ పేరుకు ఉమ్మడి రాజధానే అయినా.. ఈ నగరంపై సీమాంధ్రులకు ఎలాంటి హక్కులూ ఉండవనే క్లారిటీ వచ్చింది. సీమాంధ్ర ప్రభుత్వం ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చుపెట్టినా.. అది డెడ్ క్యాపిటలే అవుతుంది కానీ.. దాని వల్ల సీమాంధ్ర ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని అర్థమవుతోంది. అయితే ఇటువంటి తరుణంలో కూడా హైదరాబాద్ లోని ప్రభుత్వ గెస్ట్ హౌసులను రిపేర్ చేయిస్తూ... దాని కోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ.. ఇక్కడ నుంచే పాలన వ్యవహారాలను సమీక్షిస్తోంది బాబు ప్రయత్నం. ఈ విషయంలో ఇప్పటికే బాబుకు సోదరసమానులు అయిన బీజేపీ వాళ్లు అభ్యంతరం పలికారు. సీమాంధ్ర ప్రభుత్వ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి కొనసాగించడానికి వీలుదేని, సెక్రటేరియట్ తో సహా ముఖ్యమైన కార్యాలయాలను తక్షణం సీమాంధ్రలోని ఏదైనా నగరానికి తరలించాలని.. తద్వారా సీమాంధ్ర ప్రభుత్వ డబ్బును.. సీమాంధ్ర లోనే ఖర్చు పెట్టే మార్గాన్ని చూడాలని బీజేపీ వాళ్లు డిమాండ్ చేశారు. అయితే బాబు ఈ డిమాండ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. డిమాండ్ చేస్తున్నది బీజేపీ వాళ్లే అయినా.. తెలుగుదేశాధినేత దానికి కొంచెం కూడా విలువనివ్వలేదు. ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు ఈ విషయంలో మరో వాయిస్ రైజ్ అయ్యింది. దళిత ఉద్యమ నేత కత్తి పద్మారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని సుఖాలకు, లగ్జరీలకు అలవాటు పడ్డాడని.. ఆయన ప్రభుత్వాన్ని హైదరాబాద్ పరిధి నుంచి దాటించడానికి ఇష్టపడటంలేదని ఆయన ధ్వజమెత్తాడు. హైదరాబాద్ పై సీమాంధ్రులకు హక్కులు ఉండవని తెలిసినా.. అక్కడ భవనాలకు రిపేర్లు చేయిస్తూ.. అక్కడి ఇళ్లకు రంగులేయిస్తూ.. తెలుగుదేశం అధినేత సీమాంధ్ర ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నాడని పద్మారావు వ్యాఖ్యానించాడు. ప్రభుత్వం తక్షణం ఇలాంటి చర్యలు ఆపేయాలని, సీమాంధ్ర యంత్రాంగాన్ని హైదరాబాద్ నుంచి తరలించాలని ఆయన డిమాండ్ చేశాడు. మరి బాబు నిజంగానే హైదరాబాద్ సుఖాలకు అలవాటు పడి ఉంటే.. తరలించడం అనేది ఎలా సాధ్యం అవుతుంది?!

మరింత సమాచారం తెలుసుకోండి: