విభజన విచిత్రాలు చూస్తే.. ఒక్కోసారి నవ్వురాక మానదు. విభజన కారణంగా అన్నీ కష్టాలే అని బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ వాసులు.. వచ్చే అక్టోబర్ నుంచి నిరంతరాయంగా విద్యుత్ అందుకోబోతున్నారు. విభజన తరువాత రాజధానితో పాటు మిగులుబడ్జెట్ ఉందని భావిస్తున్న తెలంగాణవాసులు మాత్రం ఇప్పటికే కరెంటుకోతలతో ఇదేం తెలంగాణరా బాబూ అని లోలోపలే విసుక్కుంటున్నారు. కష్టాలతో కేరీర్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కు నిరంతర విద్యుత్ ఓ చిన్న ఊరట. ఇందుకు ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి ఉండటమే కాకుండా.. కేంద్రం రూపొందించిన నిరంతర విద్యుత్ ప్రాజెక్టులో ఏపీకి స్థానం దక్కడం కూడా ఓ కారణమే. కొత్త సీఎం చంద్రబాబు పలు హామీలను చంద్రబాబు సర్కారు అక్టోబర్ 2 నుంచి ప్రారంభించబోతున్నారు. వాటిలో ఈ నిరంతర విద్యుత్ ఒకటి.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ దిశగా కసరత్తు ప్రారంబించారు. అందులో భాగంగా జిల్లాకో మండలాన్నిపైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకుని.. నిరంతర విద్యుత్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిమండలాలతో పాటు.. కొన్నిరోజుల్లోనే విజయవాడ, విశాఖ నగరాలకు నిరంతంగా విద్యుత్ అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. అంటే ఇక విశాఖ, బెజవాడ నగరాలు ఇక కోతల్లేకుండా దేదీప్యమానంగా వెలగబోతున్నాయన్నమాట. మరి ఏపీలో ఇన్నినగరాలుండగా.. బెజవాడ, విశాఖలను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు.. ఈ ప్రశ్నకు సమాధానం.. అన్నింటిలోనూ ఈ రెండు చోట్ల మాత్రమే పంపిణీ కష్టాలు తక్కువగా ఉన్నాయట. అంతేకాదు.. ఈ రెండు చోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపు శాతం ఎక్కువగా ఉందట. సో.. ఇక ఈ రెండు నగరాలవాసులు.. కోతల్లేని విద్యుత్ సౌకర్యాన్ని అందరికంటే ముందుగా అందుకోబోతున్నారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: