రేవంత్ రెడ్డి... కొంతకాలం నుంచి చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఈ సైలెన్స్ లో రేవంత్ రెడ్డి పార్టీ మారిపోతున్నాడన్న పుకారు కూడా చాలా గట్టిగా వినిపించింది. ఆయన తెలుగుదేశానికి తలాక్ చెప్పబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయాన్ని ఖండించడానికి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను ఇవ్వలేదు. అయితే రేవంత్ రెడ్డికి నిజంగానే ఆ ఉద్దేశం ఉందేమోనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా గాబరా పడ్డాడట. రేవంత్ కు స్వయంగా ఫోన్ చేసి... పార్టీని వీడోద్దు.. అని చెప్పాడట. ఇటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చాడు. తన సహజమైన శైలిలో కేసీఆర్ , జగన్ లపై విరుచుకుపడ్డాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దొరగా అభివర్ణిస్తూ దొర బాగోతం బయటపెడతానంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. ఇక జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సమస్యలు పట్టడం లేదంటూ విమర్శించాడు. జగన్ తక్షణం తెలంగాణపై దృష్టి సారించాలంటూ.. కేసీఆర్ పై విరుచుకుపడాలంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. మరి సారు.. ఇన్ని రోజులూ ఎందుకు సైలెంటుగా ఉన్నాడో మాత్రం చెప్పలేదు. కేసీఆర్, జగన్ లు తెలుగుదేశం చెప్పినట్టుగా వినాలని అంటున్న రేవంత్ రెడ్డి.. తన గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. మల్కాజ్ గిరి ఎంపీ సీటు విషయంలో నిరాశ కలగడం, టీటీడీఎల్పీ పదవి దక్కుతుందనుకొంటే అది కూడా చేజారడం వంటివి... రేవంత్ ను బాగా డిప్రెస్ చేశాయని టాక్. ఈ నిరాశను రేవంత్ రెడ్డి బహిరంగంగానే వెల్లగక్కాడు. కులాలకు ముడిపెడుతూ.. తెలుగుదేశంలో తమను తొక్కేసే కుట్ర జరుగుతోందన్నాడు. మళ్లీ ఇప్పుడు వచ్చి ఇతర పార్టీలపై విరుచుకపడుతున్నాడు. మరి బాబు నుంచి ఏం హామీ పొందాడో ఏమో!

మరింత సమాచారం తెలుసుకోండి: