ఒకవైపు వ్యాపార వేత్తలు కోట్లకు కోట్ల అప్పులు తీసుకొని ప్రభుత్వ బ్యాంకులను ముంచుతున్నారు. వడ్డీలు కూడా చెల్లించక డీఫాల్టర్లుగా కొత్త రికార్డులు స్థాపిస్తున్నారు. దర్జాగా దొరల్లాగా తిరుగుతున్నారు! వాళ్లు వ్యవస్థలను నిండాముంచేస్తున్నా,.. ఒక్క మాట అనే నాథుడు లేడు. పైపెచ్చు వాళ్లకు వ్యాపారవేత్తలుగా గౌరవం. వాళ్ల పక్కన నిలబడటం కూడా మన రాజకీయ నేతలకు పెద్ద అర్హత! అయితే రైతులు మాత్రం లక్షన్నర రూపాయలకు మించిన రుణం తీసుకోకూడదు. అలా తీసుకొంటే వాళ్లు దొంగలు! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే అలాంటి దొంగలు! ఇదేం తీరో అర్థం కావడం లేదు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యానం చేయడం అత్యంత దురదృష్టకరమైన అంశం. ‘ రైతులకు ఒకటిన్నర లక్షల రూపాయల కన్నాఎక్కువ అప్పు ఉండదు. 1.5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ రుణాలు తీసుకున్నవారంతా దొంగలే. వారిలో వైఎస్సార్‌సీపీ వారే ఎక్కువ. అందుకే రుణాన్ని మొత్తం మాఫీ చేయలేదనే అక్కసుతో నానాయాగీ చేస్తూ నా దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు. అలాంటివారి బెదిరింపులకు నేను భయపడను’’ అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. బాబుకు వైకాపా మీద ఎంత కక్ష అయినా ఉండవచ్చు.. వాళ్లవాళ్ల రాజకీయాలతో ప్రజలకు సంబంధం లేదు. రైతులకు అంత కన్నా సంబంధం లేదు. కానీ రైతులను అవమానించే హక్కు మాత్రంచంద్రబాబు కు లేదు. లక్షన్న రూపాయలు అనేది ఈ రోజుల్లో చాలా చిన్న విషయం. అది బాబుకు కూడా తెలుసు. ఆయన ఒక రోజు ఒక జిల్లా పర్యటన పెట్టుకొంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో.. అనే విషయంపై అవగాహన ఉంటే.. లక్షన్నర అనేది చాలా విషయం అనేది బోధపడుతుంది. ఇలాంటి సమయంలో లక్షన్నర రూపాయల మించిన అప్పు ఉన్న రైతులను దొంగలు అని బాబు వంటి బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అనడం నిజంగా దురదృష్టకరం. అయినా అధికారంలో ఉన్నప్పుడు బాబు ఇలా రైతులను అవమానిచండం కొత్త కాదు కదా! అన్నం పెట్టే రైతన్న అంటే ఆయనకు ఎందుకో ఈ చిన్నచూపు!

మరింత సమాచారం తెలుసుకోండి: