రహదారులు, విద్యుత్‌, రైల్వే వంటి కీలక మంత్రిత్వశాఖల కార్యదర్శులతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సమీక్ష నిర్వహించారు. తొమ్మిది మౌలిక నిర్మాణా వ్యవస్థలకు సంబంధించిన మంత్రిత్వశాఖల అధికారులతో ఆయన ఆయా రంగాల్లో కీలక ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు. 2014-15 సంవత్సరానికి లక్ష్యాలను నిర్ధేశించుకోవడం, రహదారులు, విద్యుత్‌, రైల్వే రంగాలకు సంబంధించి కీలక పను లను గుర్తించడం కోసం జరిపిన భేటీ ప్రాధా న్యతను సంతరించుకున్నారు. ఆయా రం గాల పనితీరు గురించి, ఆయా విభాగాలలో తలపెట్టిన ప్రాజెక్టుల వివరాల గురించి ప్రణాళికా సంఘం కార్యదర్శి సింధూశ్రీ ఖుల్లార్‌ ఈ సందర్భంగా ప్రధానికి 15 పేజీలతో కూడిన నివేదికను అందచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వివిధ మంత్రిత్వశాఖల వారు ఎంచుకున్న లక్ష్యాలను, ఆ దిశలో సాగు తున్న పనులను ప్రధానికి తెలియచేసినట్లు పేర్కొన్నారు. మౌలిక నిర్మాణ వ్యవస్థకు మోడీ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతోసమీక్షలు నిర్వహించారు. శనివారం నాటి భేటీలో పెట్రోలు, టెలికాం, పునరుత్పాదన ఇంధనం, బొగ్గు, పౌర విమానయాన, రవాణా, నౌకాయాన వంటి మంత్రిత్వశాఖల ఉన్నతాధికారుల సమ క్షంలో మోడీ పలు విషయాలను సమీ క్షించారు. గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ, పర్యావరణ శాఖలకు చెందిన కార్యదర్శులు కూడా భేటీకి వచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 300 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని నిర్మించాలని ప్రణాళికా సంఘం ప్రతిపాదించింది. గత ఆర్థిక సంవ త్సరంలో రైల్వేశాఖ కొత్తగా 450 కిలోమీటర్ల రైలుమార్గాలను నిర్మించింది. ముందుగా 500 కిలోమీటర్ల రైల్వేలైన్ల లక్ష్యం పెట్టు కున్నారు. కానీ ఇది సాధ్యపడలేదు. పౌర విమానాయానం విషయంలో లక్ష్యాలను తగ్గించుకోవాలని ప్రతిపాదించారు. విమా నాశ్రయాల అభివృద్ధి అంశం కూడా ప్రస్తావ నకు వచ్చింది. దేశంలో 189 జాతీయ రహ దారుల పనులు తలపెట్టినప్పటికీ పర్యావరణం, భూసేకరణ వంటి సమస్యలతో అవి పెం డింగ్‌లో పడ్డాయి. ఈ ప్రాజెక్టులకు రూ 1,80,000ల వ్యయం అవుతుందని అంచనావేశారు. రహదారుల నిర్మాణానికి కొన్నిచోట్ల రక్షణ భూముల స్వాధీనం అంశం కూడా అడ్డంకిగా ఉంది. రైల్‌ఓవర్‌ బ్రిడ్జిల నుంచి కూడా సమస్యలు వస్తున్నాయి. మం త్రిత్వశాఖల మధ్య సమన్వయ లోపాలతో పలు ప్రాజెక్టులు ఆగిపోయిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: