వైఎస్‌ఆర్‌ పార్టీ నేతలను దొంగలు అని అంటే, ఆ మాట రైతులను అన్నట్లుగా జగన్‌ మానస పుత్రిక సాక్షి లో ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపా రు. శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధులు సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 45 రోజులకే 45 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేసిన మహానేత నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. అదేవిధంగా 13 వేల కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఈ నాడు ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, మహిళలు పండుగ చేసుకుంటూ, చంద్రబాబును అభినందింస్తున్నారని ఆయన తెలిపారు. కాని గజదొంగ వైఎస్‌ జగన్‌ మాత్రం చంద్రబాబు పై లేని పోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు చెందిన దోపిడి మీడియా దోపిడి దొంగలకు వత్తాసు పలుకుతుందని ఈ విధానం మానుకోక పోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోమిరెడ్డి హెచ్చరించారు.  గతంలో కూడా వైఎస్‌ ఈ విధంగానే చేశాడని, వ్యవసాయం దండగ అనే మాట చంద్రబాబు అనక పోయినా, ఆన్నాడని నానా యాగీ చేశాడని విమర్శించారు. జగన్‌ మోహన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో గెలిచి వుంటే రైతుల రుణాలు మాఫీ చేసే వాడేనా, రైతులు సంతోషంగా ఉండేవారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. అప్పుల బారి నుంచి రైతులను, డ్వాక్రా మహిళలను, నేతన్నలను, దళితులను విముక్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును నరకాసురుడని జగన్‌ అనటం ధారుణ మన్నారు. రైతుల రుణాలు మాఫీ చేసినందుకు చంద్రబాబు దిష్టబొమ్మలు దగ్ధం చేయమని జగన్‌ తన కార్యకర్తలను ఉసిగొల్పుతున్నాడని సోమిరెడ్డి విమర్శించారు. రాష్ట్రం 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో ఉందని,అయినా రైతుల కళ్ళలో ఆనందం చూడాలని చంద్రబాబు 45 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయటం జరిగిందన్నారు. ప్రజలు మిమ్ములను ఎందుకు ఓడించారో ఒక సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని, భూభకాసురులని, జలాసురుడని, ఖనిజా సురుడని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఓడించిన సంగతి మరిచిపోవద్దన్నారు.  2008లో యుపిఏ ప్రభుత్వం 28 రాష్ట్రాలలో కలిపి 52 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేస్తే, ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే 45 వేల కోట్ల రూపాయల రైతు ల ణాలను మాఫీ చేసిన ఘనత ఒక్క చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. గతంలో డిఫాల్టర్‌ అయిన రైతులకు, 5 ఎకరాలు లోపు ఉన్న రైతులకు మాఫీ చేశారని, కాని చంద్రబాబు ప్రభుత్వం ఏవిధమైన షరతులు లేకుండా అందరి రైతులకు రుణమాఫీ చేస్తుందని తెలిపారు. చేనేత రుణ మాఫీ కోసం అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రోశయ్య కమిటీ వేశారని, అది రెండు సంవత్సరాలకు నివేధిక ఇస్తే, ఇంరో రెండు సంవత్సరాలు ఆగి 200 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశాడని, కాని చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజే కోటయ్య కమిటీని వేసి 45 రోజుల్లోనే కమిటీ నివేధిక ఇవ్వటం రుణమాఫీ చేయటం జరిగి పోయిందని సోమిరెడ్డి తెలిపారు. వైఎస్‌ జగన్‌ మఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే పూర్తిగా దోచుకు తినే వాడని సోమిరెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని కుయుక్తులు మాని ఒక ప్రతిపక్ష నేతగా పేరు తెచ్చుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని చంద్రమోహన్‌రెడ్డి జగన్‌ను హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: