ఏపీ రాజధాని కోసం ఏర్పడిన సలహా కమిటీ తొలిసారిగా భేటీ అయింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఎంపీలు సుజానా చౌదరి, గల్లాజయదేవ్, మాజీ ఎంపీ మస్థాన్రావ్తో పాటు GMR, GVK సంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ రాజధానిని నిర్మిస్తామని రాజధాని సలహా కమిటీ వెల్లడించింది. పలుదేశాల్లో పర్యటించి మంచి మోడల్ సిటీని ఎంపికచేస్తామని, రాజధాని నిర్మాణంపై సంస్థలు కొన్ని సూచనలు చేశాయని నారాయణ వివరించారు. మరోవైపు రాజధాని నిర్మాణంపై హాజరైన సంస్థలు కొన్ని సూచనలు చేశాయి. వాటిలో బెస్ట్ ఆప్షన్లను ఎంచుకుంటామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని కమిటీ సభ్యులు విదేశాల్లో పర్యటించి వచ్చినతర్వాతే కొత్త రాజధాని ఖరారు కానున్నదని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. రాజధాని నిర్మాణం, సౌకర్యాల కల్పనపై కమిటీ చర్చించినా, రాజధాని ఎక్కడ, ఎంత బడ్జెట్ అన్న అంశాలపై చర్చించలేదని జయదేవ్ వివరించారు. ఏపీ రాజధాని నిర్మాణంపై ఇపుడు ప్రాథమిక సమావేశమే జరిగిందని తెలిపారు. విదేశీ పర్యటనల షెడ్యూల్ ఖరారు కాలేదని జయదేవ్ తెలిపారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాముల్ని చేయడం తన అదృష్టం అని జీఎంఆర్ అధినేత తెలిపారు. కాగా, ఇదే అంశంపై చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ అయింది. రాయలసీమ పర్యటన వివరాలను కమిటీ సభ్యులు సీఎంకు వివరించారు. రాజకీయ సలహా కమిటీలో చర్చించిన అంశాల ప్రస్తావన జరిగింది. భేటీలో మంత్రి నారాయణ, ఎంపీ సుజనాచౌదరి కూడా పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: