తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో నిస్తేజం నెలకొంది. కనుచూపు మేరలో అధికారం ప్రాప్తించే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో వారు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. అలాగని అటు టీఆర్ఎస్ లోకో, బీజేపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. అందుకే ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రాలో అధికారం సాధించి జోష్ మీదున్న చంద్రబాబు.. అదే తరహా పని తీరు తెలంగాణలోనూ ఆశిస్తున్నారు. అనేక బిజీ కార్యక్రమాల మధ్య తెలంగాణలో పార్టీ పరిస్థితిని సమీక్షించిన బాబు.. తెలంగాణ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారట. తెలంగాణ తెలుగుదేశం నేతలు ఇకనైనా బద్దకం వీడాలని ఘాటుగా క్లాస్ పీకారట చంద్రబాబు. సీనియర్ నేతలు తరచూ పార్టీ కార్యాలయానికి రావాలని... కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని వార్నింగ్ ఇచ్చారట. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ప్రతి శనివారం మధ్యాహ్నం తెలంగాణ నేతలకు సమయం కేటాయించాలని నిర్ణయించిన చంద్రబాబు... కార్యాచరణను అమలులోకి తీసుకొచ్చారు. సాయంత్రం దాదాపు 4 గంటలపాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారట. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. నిస్తేజం వీడి... ఉపఎన్నికలు, మెదక్ వరంగల్ ఉపఎన్నికల్లో సత్తాచాటాలని చెప్పారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉండటంతో వాటిలోనూ మంచి ఫలితాలు సాధించాలని టార్గెట్ ఫిక్స్ చేశారట. ఇందుకు తాత్కాలిక కమిటీలను ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఎన్నికలకు ముందు.. తర్వాత కేసీఆర్ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నాడని.. అతని ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జనంలోకి వెళ్లాలని సూచించారట. ఓయూ విద్యార్థులకు అండగా నిలవాలని కూడా పార్టీ నేతలకు సూచించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: