పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గురించి మరో ఆసక్తికరమైర పుకారు షికారు చేస్తోంది. ఈ పార్టీకి సంబంధించిన అధికారిక వ్యవహారాలు ఆగస్టు పదిహనుకు ప్రారంభం అవుతాయనే పుకారు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఈ ఏడాది స్వతంత్రదినోత్సవం సందర్భంగా పవన్ మీడియా ముందుకు వస్తాడని, భారీ బహిరంగ సభ పెట్టి పార్టీ గుర్తును, ఎజెండాను ఆవిష్కరిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు చాలా హడావుడి చేసి.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ప్రకటించి, ఆ పార్టీల తరపున జనాల్లో తిరిగిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత కనపడటం లేదేమిటంటూ ఒకవైపు సెటైర్లు పడుతున్నాయి. చాలా మంది పవన్ ఎక్కడా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి తరుణంలో కొత్త వార్తలు ప్రచారంలోకి రావడం విశేషం. చాలా రోజుల నుంచి ఇంటికే పరిమితం అయిన పవన్ ఇటీవల రైలు స్కూల్ బస్సను డీ కొట్టిన సంఘటనలో బాధితులుగా మారిని చిన్నారులను పరామర్శించాడు. ఆసుపత్రి వరకూ వచ్చి విద్యార్థుల కుటుంబాలను పరామర్శించాడు. మరి పిల్లలను హైదరాబాద్ ను తీసుకొచ్చారు కాబట్టి పవన్ సులభంగానే అక్కడికి వచ్చి వెళ్లాడు. అదే సంఘటన స్థలానికి అయితే పవన్ వెళ్లేవాడు కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ అభిమానులపై కూడా ఒత్తిడి అధికం అవుతోంది. ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడ? అంటూ పంచ్ లుపడుతున్నాయి. పవన్ మళ్లీ ఎన్నికల వరకూ ప్రజల ముందుకు రాడేమోనన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటినేపథ్యంలో ఆగస్టు పదిహేను న జనసేన అధికారిక కార్యకలాపాలు మొదలవ్వబోతున్నాయని అంటున్నారు. మరి అదినిజంగానే జరుగుతుందా? లేక ఉత్తిపుకారుగా మాత్రమే మిగిలిపోతుందా... అనేది వేచి చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: