సీమాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమంగా ఆస్తులు సంపాదించాడని టీఆర్‌ఎస్ విమర్శించింది. ఈమేరకు ఇవాళ టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సంపాదించిన అక్రమాస్తులను త్వరలో వెలికితీస్తామని కర్నె హెచ్చరించారు. హైటెక్ సిటీలో చంద్రబాబు కూడబెట్టిన పది ఎకరాల అక్రమ భూబాగోతాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. భూ యజమానులతో కలిసి తాము ఈ భూకబ్జాను విలేకరుల సమక్షంలో బయటపెడతామన్నారు. టీడీపీ అధినేత అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై టీడీపీ అధినేతలు ఎన్నోసార్లు అక్రమ వసూళ్లంటూ ఆరోపణలు చేశారన్నారు. ఈ ఆరోపణలు నిరూపించాలని తాము ఎన్నోసార్లు సవాలు విసిరినా టీడీపీ నేతలు నిరూపించలేక పోయారని దుయ్యబట్టారు.  టీడీపీ నేతలు కేసీఆర్‌పై ఆరోపణలను నిరూపిస్తారో లేదో తెలియదుగానీ మేమైతే చంద్రబాబు అక్రమించిన భూముల వివరాలను బయటపెడతామన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణను నాశనం చేయాలని అసమర్థ, అవినీతి సీఎం చంద్రబాబు కుట్రలు పనుతున్నాడని, కానీ ఇవన్నీ వదిలేసి తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వద్ద అరడజను కేవీపీలు తయారవుతున్నారని టీ టీడీపీ నేతలు అనడం ఎంత వరకు సమర్థనీయమని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర ఎంత మంది సుజనా చౌదరీలు తయారవుతున్నారో నేతలు గమనించాలని సూచించారు

మరింత సమాచారం తెలుసుకోండి: