మొన్నామధ్య రాజ్యసభలో కనిపించడం తప్ప మెగాస్టార్ చిరంజీవి తిరిగి మీడియా ముఖంగా కానీ, సూటిగా కానీ జనాల ముందుకు వచ్చింది లేదు.ఇప్పుడు మెగాస్టార్ రాజకీయ పరిణామాల గురించి స్పందించడం గురించి కానీ..ఇతర అంశాల గురించి తన విలువైన అభిప్రాయాలను వ్యక్త పరిచే పరిస్థితిలో లేడు! ఆఖరికి పవన్ కల్యాన్ అయినా కొంచెం తీరిక చేసుకొని స్పందిస్తాడేమో కానీ.. మెగాస్టార్ మాత్రం ఏ విషయం గురించి కూడా మారు మాట్లాడటం లేదు! ఆయన తన సినిమా కెరీర్ పునఃప్రారంభం గురించి ఆలోచిస్తున్నాడట. అందుకు సంబంధించిన వర్కవుట్లతో బిజీగా ఉన్నాడట. కథా చర్చలన్నీ ఒక కొలిక్కి తీసుకురావడంపై దృష్టిసారించాడట! మరి గత ఆరు సంవత్సరాల్లోని చిరంజీవి వేరు.. ఇకపై చూడబోతున్న చిరంజీవి వేరు! రాజకీయాల్లో ఎన్నో పాఠాలు నేర్చుకొని వచ్చి... రాజకీయాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి.. మెగాస్టార్ తిరిగి సినిమాలతో బిజీఅయిపోతున్నాడు. మరి ఈ ప్రయాణాన్ని చిరంజీవి మాటీవీలో ప్రసారం అయ్యే కార్యక్రమం ద్వారా స్టార్ట్ చేయబోతున్నాడని సమాచారం. అందుకు నాగార్జున హోస్ట్ గా ప్రసారంఅ య్యే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమాన్ని ఉపయోగించుకొంటున్నాడట! ప్రస్తుతానికి అయితే చిరంజీవి మీడియా ముందుకు వచ్చి.. ప్రజలను పలకరించబోయే కార్యక్రమం ఇదేనని టాక్. ఈ కార్యక్రమం తర్వాత చిరంజీవి పరుగు ఊపందుకొంటుందని.. వెనువెంటనే 150 సినిమా ప్రారంభోత్సవం ద్వారా అభిమానుల్లో ఉత్సాహం తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ విధంగా సినిమాలతో బిజీ అయిపోయాకా... రాజకీయాల సంగతి ఏమిటి? అంటే.. ప్రస్తుతానికి మెగాస్టార్ కు ఆ ఆలోచనలేమీ లేవట! తిరిగి సినీవ్యాపకంతో బిజీ అయిపోతే... వచ్చే ఎన్నికల ముందు ఏదో ఒకటి చేయవచ్చులే అనే భావనతో ఉన్నాడట. మొన్నటిఎన్నికల ముందు మాదిరిగా ఏదీ చేయకపోయినా.. సమస్య ఏమీ ఉండదనే అనుకొంటున్నాడట! తిరిగి సినిమాల్లోకి రావడం వల్ల చిరంజీవి రాజకీయాలకు తెరపడినట్టేనా?!

మరింత సమాచారం తెలుసుకోండి: