జయసుధ.. వైఎస్ హయాంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ సీనియర్ నటి.. మొన్నటి ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఓడిపోయారు. తెలంగాణలో జరుగతున్న రాజకీయ పరిణామాలను సకాలంలో అర్ధం చేసుకోవడంలో జయసుధ ఫెయిలైందనే చెప్పాలి. టీఆర్ఎస్ వైపు క్రమంగా మొగ్గుతున్న పరిణామాలను అంచనా వేయలేకపోయారో.. లేక.. టీఆర్ఎస్ వంటి పార్టీలో చేరేందుకు మనస్కరించలేదో కానీ.. జయసుధ కాంగ్రెస్ నుంచే బరిలో దిగారు. ఒకసారి గెలిపించిన పార్టీనే మరోసారి నమ్ముకున్నారు. పరాజయం పాలయ్యారు. సికింద్రాబాద్ నుంచి ఓడిపోయిన తర్వాత పెద్దగా పొలిటికల్ కామెంట్స్ చేయని జయసుధ లేటెస్ట్గ్ గా పార్టీ వైఖరిపై స్పందించారు. చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నందుకు ఇప్పుడు కుమిలిపోతున్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి. తెలంగాణలో పార్టీ ఓటమికి అధిష్టానానిదే కారణమని లేటెస్ట్ గా కామెంట్ చేశారు. పార్టీ కష్టపడే వారిని ఎప్పుడూ గుర్తించలేదని.. విమర్శించారు. హైకమాండ్ వైఫల్యం వల్లే పార్టీ ఓడిపోయిందని తేల్చేశారు. అంతేకాదు.. పార్టీ క్యాష్ పార్టీలనే గుర్తిస్తోందని.. పార్టీలోని పేదనాయకులను పట్టించుకోవడంలేదని వెరైటీ కామెంట్ కూడా చేశారు. జయసుధకు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నుంచి రెండు సార్లు అవకాశం కల్పించింది. ఇంతకంటే ఆమెను పార్టీ గుర్తించేదేముంటుంది.. అందులోనూ ఆమెకు టికెట్ ఇచ్చాక అన్యాయం చేసేదేముంటుంది. పోనీ ఒక్క జయసుధ మాత్రమే ఓడిపోయిందా అంటే అదీ లేదు. మరి ఎందుకు జయసుధ అంతగా కామెంట్ చేశారు. ఈ కామెంట్లను బట్టి చూస్తే.. ఆమె కూడా ఎక్కువ కాలం కాంగ్రెస్ లో కొనసాగే అవకాశం కనిపించడంలేదు. వైఎస్ చొరవతో రాజకీయాల్లోకి వచ్చిన ఈ సీనియర్ నటీమణి.. జంప్ కొడుతుందా.. లేక అసలు రాజకీయాలకు గుడ్ బై చెబుతుందా.. ఈ రెండూ కాకపోతే.. ఓపిగ్గా ఐదేళ్లపాటు సికింద్రాబాద్ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారా.. వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: