విప్రో అయినా.. టీసీఎస్ అయినా... తమకు అవసరమైతేనే కొత్తగా తమ ఆఫీసులను నెలకొల్పుతాయి. మైక్రోసాఫ్ట్ అంతటి పెద్ద సంస్థే.. భారం తగ్గించుకోవడానికి 12 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిందట. మరి మన తెలివి మీరిన రాజకీయ పార్టీలు ఇప్పుడు సాఫ్ట్ వేర్ కంపెనీల పేరుతో కూడా రాజకీయాలు ప్రారంభించాయి! ప్రసిద్ధ ఐటీ కంపెనీలు తమ బ్రాంచ్ లను మన నగరాల్లో ఓపెన్ చేస్తున్నాయి.. ఇక యువతకు అవకాశాలే అవకాశాలు అంటూ మన ప్రభుత్వాలు ప్రచారం చేసుకొంటున్నాయి. తాజా ఖబర్ ఏమిటంటే.. వైజాగ్ లో విప్రో తమ కార్యాలయాన్ని తెరవనుందని, ఐదు వేల ఉద్యోగగాలు గ్యారెంటీ అని సీమాంధ్ర ప్రభుత్వ ప్రముఖులు అంటున్నారు! మూడు ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని, ఏకంగా ఐదు వేల ఉద్యోగాలు గ్యారెంటీ అని అంటున్నారు! చూశారా.. మా సామార్థ్యం అని చెప్పుకొంటున్నారు. వందల ఎకరాలను కేటాయించి కూడా గత ప్రభుత్వాలు ఒక్క ఉద్యోగాన్ని పుట్టించలేకపోయాయని, ఇప్పుడు తాము మూడు ఎకరాలకే ఐదు వేల ఉద్యోగాలు సృష్టిస్తున్నామని తెలుగుదేశం వాళ్లు గొప్పలు చెప్పుకొంటున్నారు. మరి వీళ్ల గొప్పల సంగతి అలా ఉంటే... వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే.. విశాఖలో ఇప్పటికే విప్రో ఉంది. అక్కడ ఐదెకరాల పరిధిలో కట్టిన విప్రో ఆఫీస్ ఉంది. చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆ కంపెనీలో ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 650 అని సమాచారం! మరి ఉన్న ఆఫీసు గాక.. మరో మూడు ఎకరాలు భూమిని కోరుతోంది విప్రో! పేరున్న సంస్థ భూమి అడిగే సరికి.. దీన్ని కూడా ప్రచారంలోకి ఉపయోగించేసుకోవచ్చనేది తెలుగుదేశం నేతల ఐడియా! విప్రోకి భూమి కేటాయిస్తున్నాం... ఐదు వేల ఉద్యోగాలను తీసుకొస్తున్నాం... అంటున్నారు! మొత్తానికి ఐటీ కంపెనీలకు ఉన్న గ్లామర్ ను కూడా తమ రాజకీయాలకు అనుగుణంగా ఉపయోగించుకొంటున్నాయి పార్టీలు!

మరింత సమాచారం తెలుసుకోండి: