ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనది.. ఇంటికో ఉద్యోగం! తనకు అధికారం ఇప్పిస్తే ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇప్పిస్తానని బాబు చెప్పుకొచ్చాడు. అప్పటికీ వైకాపా వాళ్లు ఇంటికో ఉద్యోగం ఎలా ఇస్తారు? సీమాంధ్రలో ఉన్న కుటుంబల సంఖ్య ను బట్టి చూస్తే కోటిన్నర ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అని వైకాపా వాళ్లు ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే బాబు మాత్రం అధికారం అందితే అన్నీ సాధ్యమేనని స్పష్టం చేస్తూ వచ్చాడు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఒక ప్రకటన చేసింది. 2020 అంటూ ఈ ప్రకటన చేసింది! ఏపి లో 2020 నాటికి 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో ఎన్నికల ముందు ఇంటికొక ఉద్యోగం కాస్త మరో 6 ఏళ్లకు పోస్ట్ ఫోన్ అయ్యిందనుకోవాల్సి వస్తోంది. , ఇంటికో ఉద్యోగం లెక్కన దాదాపు రెండు కోట్ల ఉద్యోగాలు అనుకొంటే.. ఐదు లక్షల ఉద్యోగాలకు కూడా 2020 ని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకోసం నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.మొత్తానికి ఇంటికో ఉద్యోగం హామీ ని కూడా చంద్రబాబు ప్రభుత్వం కొత్త దారికి తీసుకెళుతోందని చెప్పవచ్చు. దీనిపై నిరుద్యోగుల స్పందన ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: