భారత ప్రధాని నరేంద్ర మోడీని చైనా పత్రిక మెచ్చుకోవడం విశేషంగానే ఉంటుంది. మోడీ గురించి చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ అనే పత్రిక ఒక కధనం ఇస్తూ ఆయన తెల్లవారుజామున 5.30 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు, అంటే దాదాపు 18 గంటల పాటు మోడీ పనిచేస్తున్నారని తెలియచేసింది. ఫైళ్లలో ఏ ఒక్కటీ పెండింగు ఉండటానికి వీల్లేదని ఉన్నతాధికారులకు మోడీ ప్రభుత్వం కచ్చితంగా చెబుతోందని వెల్లడించింది. మంత్రులంతా తమ తమ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారని, ఉన్నతాధికారులు సమయానికి వస్తున్నారో లేదో, కార్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయో లేవో చూస్తున్నారని, ఏమాత్రం సరిలేకపోయినా ఊరుకోవట్లేదని ఆ కథనంలో వివరించింది. ఈ మద్యకాలంలో వెంకయ్యనాయుడు,ప్రకాష్ జవదేకర్ తదితర మంత్రులు ఆఫీస్ లను తనిఖీ చేస్తూ సమయపాలన పాటించని ఉద్యోగులను మందలిస్తూ కనిపిస్తున్న మాట వాస్తవమే. చైనా పత్రిక కూడా మోడీ గురించి, ఆయన మంత్రుల గురించి పరిశీలించి రాయడమే విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: