కేసీఆర్ 'మేడిన్ తెలంగాణ' నినాదానికి కౌంటర్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. దేశంలో పేరెన్నికగన్న కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీర్చడం ద్వారా తన ప్రత్యర్థికి దీటైన జవాబివ్వాలని ఆయన నిశ్చయించుకున్నట్టే కనిపిస్తోంది. ఈ మేరకు ఓ హైటెక్ బ్లూప్రింట్ ను బాబు రూపొందించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఈ-గవర్నెన్స్... ఈ మూడింటి సమాహారంగా బాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తలపోస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.50,000 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించాలని, తద్వారా 2020 నాటికి నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ఏపీ సర్కారు లక్ష్యం.  ఈ ప్రణాళికలో భాగం రాష్ట్రవ్యాప్తంగా 20 ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు (ఈఎంసీ), 200 పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా, ఐటీ రంగం విషయానికొస్తే... మెగా ఐటీ హబ్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై సర్కారు ఇంకా నిశ్చితాభిప్రాయానికి రాలేదు. రాజధానికి సమీపంలో ఏర్పాటు చేయాలా? లేక, విశాఖ శివార్లలోని 2000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలా? అన్న దానిపై కసరత్తులు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: