సీమాంధ్రను సింగపూర్ చేస్తామని అంటే.. ఏదో ప్రాస బాగుంది కదా అనుకొన్నాం... సీమాంధ్ర రాజధాని నిర్మాణం విషయంలో సింగపూర్ వెళ్లి అధ్యయనం చేసి వస్తాం అంటే.. నిజంగానే, అలాంటి రాజధానిని తయారు చేస్తారేమోనని ఆశపడ్డాం.. అయితే ఇవన్నీ కాపీ కబుర్లే తప్ప మరోటి కాదని క్రమంగా రుజువవుతున్నాయి. తాజాగా తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒబామాను అనుకరిస్తున్నాడనే వార్త షికారు చేస్తోంది. ఇది వరకూ బాబు ప్రెస్ మీట్ లు పెట్టేటప్పుడు బాబు వెనక కనిపించ బ్యాక్ గ్రౌండ్ లు వేరు , ఇప్పుడు కనిపిస్తున్న బ్యాక్ గ్రౌండ్ లు వేరు. ఇప్పుడు బాబు అమెరికా అధ్యక్షుడు ఒబామాలాగా బ్యాక్ గ్రౌండ్ లో సీనరీని తయారు చేయించాడట. అమెరికా అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతుంటే వెనుకవైపున అమెరికా జెండా, అమెరికా జాతీయ చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. నిలబడి ఒబామా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు బాబు కూడా అదే రీతిన మాట్లాడుతూ ఉంటాడు... వెనుకవైపు భారతీయ జెండా, ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి ఏపీ సీఎంకు కూడా అమెరికా ప్రెసిడెంట్ స్థాయి దర్పం వస్తుందని బాబు క్రియేటివ్ మైండ్ భావించిందని అనుకోవచ్చు! అయితే ఇలాంటి సోకులు తప్పేమీ కాదనుకొన్నా.. ఇలా అనుకరించడం ఏమిటో మాత్రం అర్థం కావడం లేదు! ఒబామాను అనుకరిస్తే బాబు మరో ఒబామా అయిపోతాడా? లేక ఆంధ్రప్రదేశ్ స్థాయి అమెరికా స్థాయికి చేరుతుందా?! పులిని చూసి నక్కవాతలు పెట్టుకొన్నట్టుగా ఏమిటో ఈ వేషాలు. ఇలాంటి వేసినా.. సొంత ప్రతిభను నిరూపించుకొంటే.. ఆ విధంగానైనా అనందివచ్చు! సొంతంగా ఆలోచించే శక్తి లేనప్పుడు.. బడాయి ఎందుకు?!

మరింత సమాచారం తెలుసుకోండి: