ఒకపక్క ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటన చేయగా, దానితో తమకు సంబంధం లేని తెలంగాణ విద్యా మంత్రి జగదీష్ రెడ్డి చెప్పడం గందరగోళంగా ఉంది.ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు ఏడు నుంచి ఇరవై మూడు వరకు విద్యార్ధుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అయితే దీనికి వెళ్లాలా?వద్దా అన్న మీమాంస తెలంగాణ విద్యార్ధులలో ఏర్పడుతుంది. మొదటి ర్యాంకులవారికి సహజంగానే యూనివర్శిటీలలో సీట్లు వస్తాయి. మరి హైదరాబాద్ లోని జెఎన్టియు, ఉస్మానియ వంటి యూనివర్శిటీలలో ఆంద్ర విద్యార్ధులకు సీట్లు వస్తాయా?రావా?అలాగే చైతన్య భారతి వంటి ప్రముఖ కాలేజీలలో సీట్లు ఆశించే ఆంధ్ర విద్యార్దులకు ఛాన్స్ వస్తుందా?రాదా అన్న ప్రశ్నలకు సమాధానం రావల్సి ఉంటుంది.అలాగే తెలంగాణ విద్యార్ధులు ఇందులోపాల్గొనకపోతే , ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం చట్టబద్దంగా కౌన్సిలింగ్ నిర్వహించడం సాధ్యమేనా అన్న ప్రశ్నలకు సమాధానాలు రావల్సి ఉంది. ఏది ఏమైనా సుప్రింకోర్టులో ఆగస్టు నాలుగున కేసు విచారణకు వస్తుంది.ఆనాడు ఇలాంటి అంశాలకు ఒక క్లారిటీ వస్తే విద్యార్దులకు మంచి జరుగుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: