ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విడుదల చేసింది శ్వేతపత్రం కాదు…అవాస్తవాల పత్రమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్సా సత్యన్నారాయణ అన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని ప్రజలను మభ్యపెడుతున్నారని, మభ్యపెట్టడం, వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్యేనన్నారు. జలయజ్ఞంలో అవకతవకలు జరిగాయని అనుకుంటే విచారణ జరిపించాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. అడ్మిషన్లు, స్థానికత, శాంతిభద్రతలు, ఉద్యోగుల విభజన, ఫీజ్ రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని, దీనివలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విభజన బిల్లు ప్రకారమే పై విషయాలన్నీ జరగాలన్నారు. ఈ విషయాలలో ఏవైనా వివాదాలు తలెత్తితే, కేంద్రం పరిష్కరించాలని బొత్స సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: