అనుకున్నంతా అయ్యింది. తెలంగాణలో విద్యార్థులుకు బోధనం చెల్లించడానికి 1956 ముందు నుంచీ ఇక్కడ ఉండటమే అర్హతగా గుర్తించారు. ఆమేరకు తెలంగాణ సర్కారు జీవో కూడా విడుదల చేసింది. అంటే ఓ యాభైఏళ్ల క్రితం తెలంగాణకు వివిధ కారణాల చేత వచ్చి స్థిరపడిన వారెవ్వరైనా.. వారి పిల్లలు ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకానికి అర్హులు కారన్నమాట. ఇది ఎవరిని లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నిర్ణయమో అందరికీ తెలిసిందే. ఆంధ్రులపై ఉన్న కోపం కారణంగా హైదరాబాద్ లోని ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ నిర్ణయంతో ఇబ్బందిపడకతప్పదు. అసలు కేసీఆర్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు.? తెలంగాణలోని సీమాంధ్రులను కడుపులో పెట్టి చూసుకుంటానన్న పెద్దాయన ఇలా ఎందుకు మారిపోయినట్టు..? మహా ఐతే ఈ నిర్ణయం వల్ల తెలంగాణ సర్కారుకు ఓ వంద కోట్ల రూపాయలు మిగిలుతాయేమో కానీ.. తన సొంత ప్రజల్లోనే ఓ వర్గాన్ని ఆయన దూరం చేసుకునే సాహసం ఎందుకు చేస్తున్నట్టు..? హైదరాబాద్ లో సీమాంధ్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నది విస్మరించలేని వాస్తవం. మరి వారి ఓట్లు కేసీఆర్ కు అవసరం లేదా..? చూస్తూ చూస్తూ ఓ వర్గం వారిని ఆయన శత్రువులుగా ఎందుకు తయారు చేసుకుంటున్నట్టు..? ఈ పరిణామాలకు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించడమే లక్ష్యగా కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జీహెచ్ ఎంసీ పరిధిలో టీఆర్ఎస్ దాదాపు జీరో. ఇక్కడి సీమాంధ్రులు ఎలాగూ టీఆర్ఎస్ కు ఓట్లేయరన్నది సంగతి తెలిసిందే. ఇక మిగిలింది తెలంగాణవారు. ఆ ఓటు బ్యాంక్ ను ఇప్పటివరకూ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, తెలుగుదేశం పార్టీలు పంచుకుంటున్నాయి. ఇప్పుడు ఇలాంటి జీవోల ద్వారా వారిలో ప్రాంతీయవాదన్ని తట్టిలేపి.. శభాష్ మన కోసం కేసీఆర్ భలే చేస్తున్నాడ్రా అనిపించుకుని.. ఆ ఓటు బ్యాంకును గంపగుత్తగా టీఆర్ఎస్ బదలాయించుకోవాలన్నది కేసీఆర్ ప్లాన్ గా కనిపిస్తోంది. జీహెచ్ ఎంసీ పరిధిలో ఓటర్లు వేస్తే టీడీపీకి ఓటేయాలి. లేదంటే టీఆర్ఎస్ వేయాలి. అలాంటి పరిస్థితి కల్పించాలి. అదీ కేసీఆర్ ప్రణాళిక. మరి ఇది ఎంతవరకూ వర్క ఔట్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: