త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఊరిస్తున్నాయి. ఇళ్లకు 24 గంటల విద్యుత్ తో అభివృద్ధి విషయంలో మరో ముందడుగు వేసినట్టు అవుతుందని.. మా ప్రభుత్వాలు వచ్చాకా ఇది గొప్ప ముందడుగు అని బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఘనంగా చెప్పుకొంటున్నాయి. మరి ఆ సంగతి ఇలా ఉన్నా.. ఇప్పుడు మరో పిడుగు పాటు వార్త వినిపిస్తోంది. ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ లో కరెంటు చార్జీలు పెరగడం ఖాయమని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసి ఉందట. కరెంటు బిల్లులను పెంచుతూ నిర్ణయం తీసుకోనుందట! ఇక ప్రకటన చేయడమే తరువాయి అని తెలుస్తోంది. పెంచిన బిల్లులు ఆగస్టు నుంచే అమల్లోకి రానున్నాయంటున్నారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండోనెలలోనే పెద్ద షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది! మరి 24 గంటల విద్యుత్ ఎలా ఉన్నా.. విద్యుత్ చార్జీల పెంపు మాత్రం ప్రజలకు భారమేనని చెప్పవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ విద్యుత్ చార్జీలను భారీగా పెంచి వెళ్లింది. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది. మరి ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూడా అదే పని చేస్తే.. ప్రజలు మరింత ఇబ్బందుల్లో పడిపోతారనడంలో సందేహం లేదు! ఇక్కడ గమనించాల్సిన విషయం మరోటి ఉంది.. ఒకవేళ 24 గంటల విద్యుత్ సరఫరా జరిగితే... పెరిగిన బిల్లులు కూడా అమల్లోకి వస్తే.. అప్పుడు మీటర్లు వాయువేగంతో తిరుగుతాయి. కరెంటు ఉండటంతో వినియోగం ఎక్కువవుతోంది! అప్పుడు కరెంటు బిల్లులు కట్టడమే నెలవారీ బడ్జెట్ లో అతి పెద్ద విషయం అవుతుందనడంలో సందేహం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: