ప్రస్తుతం నాని ఫిల్మ్ కెరీర్ చాలా స్లోగా ఉంది. త్వరలో ఏదొక సక్సెస్ సాధించకపోతే నాని ఫిల్మ్ కెరీర్ డైలమాలో పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా నాని మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాడు. అంతే కాకుండా ఇతర భాషల్లో సక్సెస్ సాధించిన మూవీలను తెలుగులో రిమేక్ చేయటానికి సైతం ఎదురుచూస్తున్నాడు. ఆ విధంగానే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి, తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘పన్నాయిరుం పద్మినియుం’ కోలీవుడ్ లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. దీంతో ఈ మూవీపై నాని మనసు పడింది. వెంటనే ‘పన్నాయిరుం పద్మినియుం’ సినిమా రీమేక్ రైట్స్ ని నాని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీని నాని తన సొంత నిర్మాణంలో నిర్మించనున్నాడు. అలాగే ఆ మూవీని గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెలుగులో రిమేక్ చేయటానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాని టీం సైతం కథలో కొద్దిపాటి మార్పులని చేస్తున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఇదే మూవీలో నాని హీరో కూడ నటిస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకి నాని క్లారిటి ఇచ్చాడు. తమిళ మూవీని తెలుగులో రిమేక్ చేయటమే కాకుండా తానే హీరోగా చేయనున్నట్లు నాని అఫిషియల్ చెప్పేసాడు. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది. అలాగే మిగిలిన 3 కీలక పాత్రల్లో ఎవరెవరు నటిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా ఈ మూవీకి సంబందించిన ఇతర టెక్నీషియన్స్ గురించిన వివరాలు త్వరలోనే బయటకు తెలియనున్నాయి. ప్రస్తుతం నాని మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ‘జెండాపై కపిరాజు’ ఆగష్టు 8న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: