ఆంద్ర,తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వాల మద్య పోరు రోజుకో రకంగా సాగుతోంది. చివరికి రాజకీయ నేతలు పాటించవలసిన ప్రమాణాలను కూడా విస్మరించి వీరు విమర్శలు చేసుకుంటున్నారు.ఒక్కోసారి నీటి కుళాయిల దగ్గర జరిగే వీది పొరాటాల మాదిరి చేస్తున్నారు.తాజాగా ఎమ్మెల్యేల కు కేటాయించే క్వార్టర్ల విషయంలో కూడా అలాగే గొడవలు పడుతున్నారు. ఆంద్ర శాసనసభ్యుల సదుపాయాల కమిటీ తమకు కేటాయించిన క్వార్టర్లలో తెలంగాణ రాష్ట్రం వారు ఉండడంతో వారికి నోటీసులు ఇచ్చారు. అలాగే తెలంగాణ కమిటీ కూడా తమకు కేటాయించిన క్వార్టర్లలో కొందరు ఆంద్ర ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉండడం గమనించి వారికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబు క్వార్టర్ ఖాళీ చేయకుండా ఉండడంపై ఒక ఉద్యోగి వెళితే ఆయనపై దౌర్జన్యంగా వ్యవహరించారని తెలంగాణ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విమర్శించారు. అసలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే హైదరాబాద్ వదలి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా ఆంద్రకు ఇచ్చిన కొన్ని క్వార్టర్లు అధ్వాన్నంగా ఉన్నాయని వీరు విమర్శిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా క్వార్టర్ల తగాదాలు సాగేవి.కానిఇప్పుడు జరుగుతున్న తీరు రెండు ప్రాంతాల మధ్య తగాదాగా మారి వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. ఇక ఎపి శాసనసభ భవనంలో రిపేర్లు చేస్తుంటే సోలిపేట రామలింగారెడ్డి వెళ్లి అబ్యంతరం చెప్పారట. ఇక్కడ ఉండడానికి భవనం ఇచ్చారు తప్ప మార్పులు చేయడానికి కాదని అన్నారట. హెరిటేజ్ భవనం కనుక ఎలాంటి రిపేర్లు చేయడానికి వీలు లేదని చెప్పారట.ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన ఎమ్మెల్యేలు ఇలాంటి చిన్న ,చిన్న విషయాలలో ఇంతగా గొడవ పడాలా?

మరింత సమాచారం తెలుసుకోండి: