కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యంత వెనుకబడి రాష్ట్రంగా పేరు సంపాదించుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం చంద్రబాబు ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మానవవనరులపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి మాటల్లో.. విద్యపై..గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. విద్యార్ధులు విద్యలో రాణించడానికి ప్రోత్సహాకాలు ప్రకటించాం. గత దశాబ్దం కాలంలో విద్య పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్‌లో ఉన్నత విద్యాలయాల స్థాపనకు టిడిపి ఆమోఘమైన కృషి చేసింది. మా ప్రభుత్వం కాలంలోనే ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశాం. ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకూ అభివృద్ధి చేశాం. పేదరికం, అనారోగ్యం, శిశుమరణాలకు ప్రధానం కారణం మహిళలు విద్యలో వెనకబడి ఉండటమే. ప్రాథమిక, ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్లు ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కళాశాలలు పెరిగినా వాటిల్లో చేరేవారి సంఖ్య పూర్తిగా తగ్గింది. టిడిపి హయాంలో ప్రజలలో విద్యపై అవగాహనం కల్పించి వారంతట వారే చదువుకోవాలని విద్యాలయాల్లో చేరేవారు. కానీ నేడు అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితి ఉంది. దీనంతటికీ యూపీఏ ప్రభుత్వమే కారణం. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌లో విద్యవైపు చూసేలా చేస్తాం. ఏపీని ఒక ‘నాలెడ్జ్ హబ్‌’గా తీర్చిదిద్దుతాం. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య పూర్తిగా తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు లేక విద్యాలందరూ ప్రైవేటు సంస్థల వైపే మొగ్గు చూపారు. విద్యా సంబంధిత పథకాలను కేంద్రం పట్టించుకోకపోవడం, నుంచి నిధులు రాకపోవడంతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ధ్వంసమైంది. స్కూల్ భవనాల నిర్మాణం చేపట్టలేదు, వసతులు కల్పించలేదు. విద్యా వ్యవస్థనంతా నాశనం చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయుల నియామకాలూ చేయలేదు. ఆరోగ్యం...టిడిపి పాలనా కాలంలో పూర్తిగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చాం. గడిచిన దశాబ్దం కాలంలో దేశ ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు. పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే పౌష్టికాహారం కావాలి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. దేశంలో పేదరికం పెరిగిపోయింది. పిల్లలకు పౌష్టికాహారం సరిగా అందటం లేదు. కాంగ్రెస్ పాలనాకాలంలో మాతాశిశు మరణాలు ఎక్కువయ్యాయి. టిడిపి ప్రభుత్వ కాలంలో మాతాశిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో దశాబ్దం కాలంలో అనేక శిశుమరణాలు నమోదయ్యాయి. ఆరోగ్య శ్రీ ఒక మోసపూరిత పథకం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా పట్టించుకోలేదు. వెరసి ఎందరో మహిళలు, చిన్నారులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలవడం, మరణించడం జరిగింది. గతంలో టిడిపి ప్రజల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారించిందని, నేడు కూడా ప్రజల ఆరోగ్యంపై, పౌష్టికాహారం అందించటంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

మరింత సమాచారం తెలుసుకోండి: