తెలంగాణకు సానియామీర్జా బ్రాండ్ అంబాసిడర్ అంటే.. వెంటనే ఎదురైన ప్రశ్న మరి ఆంద్రకు ఎవరు? అని! హైదరాబాదీగా తెలంగాణ దాన్ని అంటున్న సానియాను తెలంగాణ ప్రభుత్వం అంబాసిడర్ గా నియమించుకొంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరిని అంబాసిడర్్ గా నియమించుకొంటుంది? అనే విషయం గురించి అనేక ఊహాగానాలు చెలరేగాయి! కొంతమందేమో మహేశ్ బాబు అన్నారు, మరికొందరు జూ.ఎన్టీఆర్ అన్నారు, ఇంకొందరు పవన్ కల్యాన్ పేరును సిఫారసు చేశారు.. ఇంకా కోనేరు హంపీ వంటి వారి పేర్లు కూడా వినిపించాయి. అయితే ఇలాంటి ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తనే బ్రాండ్ అంబాసిడర్ అని బాబు ప్రకటించుకొన్నాడు! మొత్తానికి ఈ ప్రకటన ద్వారా తెలుగుదేశం అధ్యక్షుడు తనేంటో నిరూపించుకొన్నాడని చెప్పవచ్చు! తనకు సాటి వచ్చే సెలబ్రిటీ ఎవరూ లేరన్నట్టుగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. సినిమా వాళ్లు అయినా, క్రీడాకారులు అయినా తనకు సాటి వచ్చే వారు కారని.. ఆంధ్రప్రదేశ్ కు మరో అంబాసిడర్ అవసరం లేదని.. తనే ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం తనే అనేంత కాన్పిడెన్స్ తో ఉన్నాడు! మొత్తానికి బాబు మంచి పంచ్ ఇచ్చాడు! తన అభిమానులతో విజిల్స్ కొట్టించుకొంటున్నాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: