ఏమో అనుకొన్నారు... రాహుల్ గాంధీ ఇక తిరుగులేని నేత అవుతాడని అందరూ అనుకొన్నారు. లోక్ సభలో ఆయన వెల్ వరకూ దూసుకు వెళ్లే సరికి.. ఇక రాహుల్ లోని కొత్త యాంగిల్ కనిపిస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే అంత లేదనే విషయాన్ని కూడా రాహుల్ అప్పుడే నిరూపించాడు. తనది ఉత్తుత్తి ప్రతాపమేనని ఆయన స్పష్టత ఇచ్చాడు! విషయం ఏమిటంటే... దేశంలో అక్కడక్కడ చెలరేగుతున్న మత ఘర్షణల గురించి లోక్ సభలోజరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొనలేదు. సభలో చర్చకు మొదట డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ తీరా చర్చ ప్రారంభం అయ్యేసరికి ఎవరి కంటికీ కనపడకుండా పోయాడు. సభలో మతఘర్షణల గురించి గురువారం చర్చ జరగగా.. ఆ రోజున రాహుల్ సభకు హాజరు కాలేదు. దీంతో నివ్వెరపోవడం కాంగ్రెస్ నేతల వంతు అయ్యింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై ధ్వజమెత్తడానికి కేవలం మతఘర్షణల అంశం గురించి మాత్రమే ఆధారపడింది. అంతకుమించి ఆ పార్టీకి మరో పాయింట్ లేకుండా పోయింది. ఇటువంటి నేపథ్యంలో సభ ఆవల సోనియాగాంధీ కూడా మతఘర్షణల అంశం గురించి మాట్లాడింది. ఇక ఈ పాయింట్ మీద కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని అనుకొంటే... సభలో చర్చ లో కూడా పాల్గొని దుమ్ముదులిపేస్తుందని అనుకొంటే.. తీరా సభలో రాహుల్ గాంధీ కనపడకుండా పోయారు! మొత్తానికి ఇదీ కథ... రాహుల్ గాంధీ సారధి అయ్యి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళతాడు అనుకొంటే... ఆయన తనదైన రీతిలోనే వ్యవహరిస్తున్నాడు. పలాయనవాదాన్ని నమ్ముకొన్నాడు. మరి ఇలాంటి సారధితో.. పార్టీ ఎలా వేగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: