ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విజయవాడ తాత్కాలిక రాజధాని అవు టతోంది. భవిష్యత్తులో ఇదే శాశ్వత రాజధానిగా మారబోతోందా? అంటే అవుననే అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఓ సారి అన్ని ప్రభుత్వ విభాగాలూ ఓ చోట ఏర్పాటయితే, వాటిని తిరిగి ఇంకో చోటకి తరలిం చడం అంటే అదేమంత చిన్న విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త రాజధాని గురించి ఆలోచించడం కన్నా, వున్న ప్రముఖ నగరాల్లో ఏదో ఒకదానిని రాజధానిగా చేసుకుని, అక్కడినుంచి పరిపాలన కొనసాగిస్తూ, భవిష్య త్తులో కొత్త రాజధాని లేదా మెగా సిటీని నిర్మించుకోవడం ఉత్తమం అన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి కొన్నా ళ్ళుగా వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్ళకు తత్వం బోధపడ డంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధాని విషయంలో ముందడుగు వేశారు. విజయవాడలోని విమానాశ్రయంలో వున్న గన్నవరం ప్రాంతమంతా అతి త్వరలో తాత్కాలిక రాజధా నిగా ఓ వెలుగు వెలిగేందుకు సిద్ధంగా వుంది. సమీపం లోని ఇంజనీరింగ్‌ కళాశాలల్ని సైతం అధికారిక కార్యకలా పాలు నిర్వహించేందుకు వీలుగా కార్యాలయాల్లా మార్చితే ఎలా వుంటుందన్న దిశగా అధికార గణం ఆలోచనలు చేస్తుండడం గమనార్హం.నీటి సమస్యలుండవు, విమానా శ్రయం అందుబాటులో వుంటుంది, పైగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఆర్థికంగా బలవంతులున్న ఉభయ గోదావరి జిల్లాలకు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు మధ్యనున్న ప్రాం తం కావడంతో, ఇవన్నీ కొంతమేర తాత్కాలిక రాజధాని కి అనుకూలంగా మారాయి. కొంతమేర కాదు, పూర్తిస్థా యిలో అనుకూలమని అనేవారున్నప్పటికీ, రాయలసీమ కు సుదూర ప్రాంతం కావడంతో కొన్ని ఇబ్బందులైతే తప్ప వని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ తాత్కా లిక రాజధాని మాత్రమే కాబట్టి వివాదాలు అనవసరం అన్నది ప్రభుత్వ వర్గాల వాదన. ఎవరి వాదనలు ఎలా వున్నా భవిష్యత్తులో కొత్త రాజధాని నిర్మించాలనుకున్నా ముందుగా తాత్కాలిక రాజధాని అత్యవసరం అనే విష యాన్ని ముఖ్యమంత్రి గుర్తించారు. ఒక్క ప్రభుత్వ కార్యా లయం ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్‌ నుంచి తరలి వెళితే, ఆ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, వారి కారణంగా మరికొన్ని కుటుంబాలు జీవనం సాగించేందుకు అవకా శం వుండడం కూడా అనివార్యం. తాత్కాలిక రాజధానివల్ల ఇలాంటి సానుకూలతలు అనే కం వున్నాయి. తాత్కాలిక రాజధాని అని చెబుతున్నా... శాశ్వత రాజధాని తరహా లోనే విజయవాడలో ఏర్పాట్లు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. సింగపూర్‌ తరహా అభివృద్ధి చెందిన రాజధానికి సంబంధించి అది ఇప్పటికైతే మిలి యన్‌ డాలర్ల ప్రశ్నే అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అలాంటిది. ముందంటూ ఆర్థిక వ్యవస్థ కుదుట పడితే, ఆ తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యాక్రమాలైనా వాటంతట అవే లైన్‌లోకొస్తాయనేది బాబా యోచనగా వుంది. తాత్కాలిక రాజధాని ఓ ప్రాంత ప్రయోజనాల కోస మే అన్న భావన రాకుండా, ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ వ్యవహ రించగలు గు తుందా? వ్యవహరించగలిగితే... వివాదా లకు తావులే కుండా ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన కొనసా గేందుకు ఆస్కారం ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: