భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం ప్రకటించారు. 11మంది ఉపాధ్యక్షులు , 8మంది కార్యదర్శులు గా నియమించారు. ఉపాధ్యక్షులుగా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నియమితులయ్యారు.ప్రధాన కార్యదర్శులుగా రామ్ మాధవ్, జేపీ వడ్డా, మురళీ దర్ రావు సహా 8మంది నియమితులయ్యారు. బిజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా విజయ రహాత్కర్ నియమితులయ్యారు.బీజేవైఎం అధ్యక్షుడిగా అనురాగ్ ఠాగూర్ కొనసాగిస్తూన్నారు. అలాగే పదిమంది జాతీయ అధికార ప్రతినిధులు నియమితులయ్యారు. ఇక తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయ, మురళీధరరావుకు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాంమాధవ్, జేవీఎల్ నరసింహరావులకు చోటు దక్కగా,కొత్త కార్యవర్గంలో వరుణ్ గాంధీకి చోటు దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: