ఇప్పటికే ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి పటిష్టమైన వ్యూహాన్ని రచించాడట తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. పార్టీలోని, ప్రభుత్వంలోని ముఖ్యమైన నేతలందరికీ ఎవరెవరు ఏ విధంగా వైకాపాను ఎదుర్కోవాలో బాధ్యతలను అప్పగించారట. ఎవరు ప్రెస్ మీట్ లు పెట్టాలి.. ఎవరు ప్రసంగాలు చేయాలి.. ఎవరు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ఏ విషయంలో లక్ష్యంగా చేసుకోవాలనే అంశంపై పటిష్టమైన కార్యాచారణను రూపొందించారట. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైకాపాను ఎదుర్కోవడానికి తెలుగుదేశం ఈ రకమైన ప్రణాళికను రచించిందని సమాచారం. మరి జగన్ ను ఎదుర్కోవడానికి తన బలగాన్ని సిద్ధం చేయాలని భావించిన తెలుగుదేశం అధ్యక్షుడు ఈ పనిలో పార్టీ తెలంగాణ విభాగాన్ని కూడా సన్నద్ధం చేయాలని భావిస్తున్నాడట. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం కూడా టార్గెట్ జగన్ మోహన్ రెడ్డి కి సన్నద్ధం అయ్యిందని సమాచారం. జగన్ ను విమర్శించడమే పని గా పెట్టుకొని తెలుగుదేశంలో చాలా మంది ఉన్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు. .దాదాపు ఐదేళ్ల నుంచి జరుగుతున్న పనే. అయితే రాష్ట్ర విభజన అనంతరం కూడా జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి తెలంగాణ ప్రాంత నేతలు ఎల్లవేళలా సిద్ధఃగా ఉన్నారు. మరి ఇప్పుడు తమ ప్రభుత్వంలోని లోపాలను ప్రశ్నించబోతున్న జగన్ ను కూడా వీళ్లు గతంలానే టార్గెట్ చేయడానికి సిద్ధమవుతున్నారట. మరి జగన్ విషయంలో టీడీపీ వాళ్లు ఎన్ని మాట్లాడినా.. ఎంత మాట్లాడినా చివరకు లక్ష కోట్ల రూపాయల వద్దకే వచ్చి ఆగాల్సిందే. ఎన్నికల ముందు నాటి మాటనే ఇప్పుడు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. మరి అప్పుడంటే బాగానే ఉంది కానీ.. ఇప్పుడుకూడా అదే మాట మాట్లాడితే చెప్పేవాళ్లకు ఏమో కానీ, వినేవాళ్లకు మాత్రం విసుగొస్తుంది. అయితే తెలుగుదేశానికి మరో మార్గం కూడా లేదు. అలా ప్రొసీడయిపోవడమే!

మరింత సమాచారం తెలుసుకోండి: