తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మెదక్ పార్లమెంట్ స్థానం ,ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నందిగామా అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 20 న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ ఉంటుంది. సెప్టెంబర్ 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మెదక్ జిల్లా పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో వైపు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.  దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో మూడు ఎంపీ, 33 అసెంబ్లీ స్ధానాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల 20న వాటన్నింటికీ నోటిఫికేషన్ జారీ చేయనుంది.ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మెదక్ ఎంపీ స్థానం, ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణాజిల్లా నందిగామ మండలం అసెంబ్లీ స్థానం కూడా ఉన్నాయి. కాగా, కోర్టు కేసు నేపథ్యంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ఖరారు చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: