నవ్యాంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో ఎక్కడలేని గందగోళం కనిపిస్తోంది. ప్రభుత్వం తరపు నుంచి రోజుకో ప్రకటన రావడం.. ఓవైపు శివరామకృష్ణన్ కమిటీ పర్యటనలు కొనసాగడం.. చంద్రబాబు కూడా రోజుకో మాట మాట్లాడటం.. విపక్షలా విమర్శలు.. ఆరోపణలు ఇలా ఎంత ఈ విషయంలో గందరగోళానికి అంతూపొంతూలేకుండా పోతోంది. బెజవాడ-గుంటూరు మధ్యనే రాజధాని అని దాదాపుగా చంద్రబాబు సహా అధికార పార్టీ నేతలంతా ఓ అభిప్రాయానికి వచ్చినా.. ఆవిషయం నేరుగా చెప్పడం లేదు. ఏనుగు గురించి చెప్పేటప్పుడు ఏనుగు అని నేరుగా చెప్పకుండా.. భారీ శరీరం ఉంటుంది.. ఒక తొండం ఉంటుంది. రెండు దంతాలుంటాయి.. అని చెప్పినట్టుంది చంద్రబాబు వ్యవహారం.. రాష్ట్రానికి మధ్యన ఉంటుంది. ఆల్రెడీ డెవలప్ అయిన నగరానికి దగ్గరగా ఉంటుంది.. అని చెబుతున్నారే గానీ.. బెజవాడ-గుంటూరు మధ్యనే అని తేల్చి చెప్పడం లేదు. బెజవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించడం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. పదేళ్లవరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే అవకాశం ఉన్నప్పుడు.. మళ్లీ విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించడం ఎందుకు.. మరోవైపు ప్రతిపక్షాలు ఈ విషయంపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. చంద్రబాబు, ఆయన కోటరీ అంతా బెజవాడ-గుంటూరు మధ్య భూములు కొన్నందువల్లనే అక్కడ రాజధాని పెడుతున్నారని జగన్ పార్టీ విమర్శిస్తోంది. మరోవైపు రఘువీరా.. ఏకాభిప్రాయంతోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ నేతలు కూడా ఇప్పుడిప్పుడే మేలుకొంటూ.. గుంటూరు-బెజవాడ రాజధానిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణకే వేల కోట్లు ఖర్చు చేస్తే ఇక రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మరి చంద్రబాబు ఈ అంశానికి ఎప్పుడు తెరదించుతారో..

మరింత సమాచారం తెలుసుకోండి: