ఏపీ ప్రభుత్వ ఆర్థిక స్థితి సామాన్యుడికి ఏమీ బోధపడటం లేదు. ఏపీ ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకొంటున్న మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూసినా... ఆ ప్రభుత్వ వ్యవహారాల్లో రెండు వెర్షన్లు కనిపిస్తాయి. ఒకవైపు ప్రభుత్వ పెద్దల సౌకర్యాల కోసం, వారి సోకుల కోసం కోట్ల రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం ద్రవ్య లోటు కనిపిస్తోంది. కమిటీలు వేసి పబ్బం గడపాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వాళ్లు ఒక హోర్డింగ్ కోసం కోటి రూపాయల రెంట్ కట్టారట. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఒక హోర్డింగ్ లో మూడు నెలల పాటు యాడ్ ఉంచినందుకు ఈ డబ్బును చెల్లించనున్నారట! ఒకవైపు ప్రభుత్వ పెద్దల కు అందే సౌకర్యాలు ఏ మాత్రం లోటు కనపడటం లేదు! రాష్ట్రం పునర్విభజనకు గురైంది.. ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది... మనవి బీదల పాట్లు... అనే మాటలు కేవలం ప్రజలకు వినిపించేవి మాత్రమే. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలకు కూడా అలాంటి సదుపాయాలున్నాయి. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్టుగా... ప్రభుత్వాధినేతల సౌకర్యాలు ఎలాంటిలోటూ లేదట! భారత దేశంలో ధనికులతో కూడిన పేద దేశం అన్నట్టుగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ సరిగాలేకపోయినా... సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వం! మరో తాజా ఖబర్ ఏమిటంటే... పంచాయతీ సెక్రటేరియట్ లకు జీతాలే అందడం లేదట. నెల వచ్చి పక్షం రోజులు దాటిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అయిన వాళ్లకు జీతం అందడం లేదని సమాచారం. ఈ మేరకు వాళ్లు నిరసనలకు కూడా రెడీ అయిపోతున్నారట. ప్రభుత్వం ఈ వ్యవహారంపై కమిటీ వేస్తుందో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: