బెజవాడ హెల్త్ సిటీగా రూపుదిద్దుకోనుంది. ఇన్ని రోజులూ చదువుల పరంగా నెంబర్ వన్ అనిపించుకున్న విజయవాడ ఇకపై వైద్యంలో కూడా నెంబర్ వన్ అనిపించుకునేందుకు రెఢీ అవుతోంది..రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో సెంటర్ ఆఫ్ ది స్టేట్ గా మారిన బెజవాడకు కార్పోరేట్ హాస్పిటల్స్ క్యూ కడుతున్నాయి. ఇన్నిరోజులూ కార్పోరేట్ వైద్యం కోసం హైదరాబాద్ గడప తొక్కిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకపై బెడవాడ బాట పట్టనున్నారు. విజయవాడ వెళితే చాలు అన్ని కార్పోరేట్ సేవలు వారికి అందుబాటులో ఉండనున్నాయి. నగరంలో ఇప్పటివరకూ ప్రభుత్వ ఆసుపత్రి తోపాటు ఓ మెడికల్ కాలేజి మాత్రమే సంజీవని కేంద్రాలుగా ఉండేవి. అయితే రాష్ట్ర విభజనతో హైదరాబాద్ లో ఉన్న కార్పేరేట్ ఆస్పత్రులన్నీ విజయవాడలోనూ తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే 350 పడకలతో కామినేని హాస్పిటల్స్, 3 వందల పడకలతో ఆంధ్రా హస్పిటల్స్ విజయవాడ కేంద్రంగా కొత్త బ్రాంచిలు ఏర్పాటు చేశాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కార్పోరేట్ ఆస్పత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇన్సెంటివ్ కేర్ తో పాటు మెదడు, గుండె సంబంధిత వ్యాధులకు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ రెండు ఆసుపత్రులతో వందల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. ప్రభుత్వం అందించే అన్నిరకాల సబ్సిడీల ద్వారా పేదలకు కార్పోరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తామంటున్నాయి కార్పోరేట్ ఆసుపత్రుల యజమాన్యాలు. ప్రస్తుతం వచ్చిన రెండు ఆసుపత్రులే కాకుండా ముందుముందు మరిన్ని కార్పోరేట్ ఆస్పత్రులు బెజవాడలో వెలవనున్నాయి. వీటితో పాటే వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లభిస్తుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: