బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన కొత్త టీంను ఎనౌన్స్ చేశారు. 11 మంది సభ్యులతో కార్యవర్గాన్ని ప్రకటించారు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించారు అమిత్ షా. పార్టీలో ఒక మనిషికి ఒకే పదవి ట్రెడిషన్ ను ఫాలో అవుతున్నట్లు ప్రకటించారు. నంద్ కుమార్ సింగ్ చవాన్ ను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిగా నియమించారు. మధ్యప్రదేశ్ కు గతంలో నరేంద్ర సింగ్ తోమర్ చీఫ్ గా ఉండేవారు..ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో నంద్ కుమార్ కు అమిత్ షా అవకాశం కల్పించారు. ఇక ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిగా ధర్మపాల్ కౌషిక్ ను ఎంపిక చేశారు అమిత్ షా. గతంలో ఈ రాష్ట్రానికి విష్టు దియో సాయి అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఆయన పదవిలో ఉండటంతో ధర్మపాల్ కౌషిక్ కు అవకాశం ఇచ్చారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా సౌందర్ రాజన్ ను ఎంపిక చేశారు. రాధాకృష్ణన్ స్థానంలో ఆయన్ను కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అస్సాం రాష్ట్రానికి కూడా బీజేపీ కొత్త కెప్టెన్ ను అమిత్ షా నియమించారు. సిద్ధార్ధ భట్టాచార్య అస్సాం రాష్ట్రానికి కొత్త ప్రెసిడెంట్ గా వ్యవహరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: