1956 స్థానికత పెట్టడంపై టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అప్పటి స్థానికతను తీసుకురావడం సాధ్యమేనా అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. బీహార్ నుంచి విజయనగరం వలస వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన కేసీఆర్ సీఎం కావోచ్చా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన ఇంటికి మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇప్పించుకున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.  ఉద్యమ సమయంలో విద్యార్ధుల మద్దతు కోరిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాన అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్ధులపై కేసీఆర్ వైఖరి కక్ష పూరితంగా ఉందన్నారు రేవంత్. విద్యార్ధులపై లాఠీ ఛార్జ్ చేయడం సరికాదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విద్యారంగం-ప్రభుత్వ వైఖరి అనే అంశంపై జరిగిన ఇష్టాగోష్టిలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: