రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం తొమ్బిది గంటలకు ప్రారంభం కానున్న సమావేశాలు మధ్యాహ్నాం రెండు గంటల వరకు జరగనున్నాయి. శాసనసభ వేదికగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రధానప్రతిపక్షపార్టీ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ దృష్టి సారించింది.విపక్ష విమ ర్శలను తిప్పికొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా వ్యూహాం రూపొందించింది. అంశాల వారిగా సీనియర్‌ మంత్రులకు, శాసనసభ్యులకు ముఖ్య మంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు.ప్రతి అంశంపైనా పూర్తిస్థాయిలో చర్చకు సిద్దమైరావాలని ఆదేశించారు. మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్‌ఆర్‌సిపి శాసనసభ పక్షం అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పూర్తిస్థాయిలో చర్చించింది. తొలిరోజునుండే దూకూడుగా వ్యవహరించాలన్న అభిప్రాయానికి ఆపార్టీ వచ్చి నట్లు తెలిసింది. దీనిలో భాగంగానే సోమవారం ఉదయం జరగనున్న శాసనసభ వ్యవహారాల కమిటీ (బిఎసి) సమావేశాన్ని బహిష్కరించాలని ఆ పార్టీ నిర్ణయించింది. బిఎసిలో తమకు న్యాయ మైన వాటా ఇవ్వ్లలేదని ఆ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గత సమావేశాల సందర్భంగా కూడా బిఎసి సమావేశానికి వైఎస్‌ఆర్‌సిపి హాజరుకాలేదు. రుణమాఫీ, రాజధాని అంశాల ను ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా ప్రభు త్వాన్ని ఇరుకున పెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. వీటితో పాటు ఫీజు రీయంబర్స్‌మెంటు అంశాన్ని కూడా ఆ పార్టీ ప్రస్తావించనుంది. రుణమాఫీ అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఈ అంశంపై ప్రత్యేక చర్చకు పట్టుబట్టాలన్న నిర్ణయానికి ఈ సమావేశంలో వచ్చారు. రుణమాఫీ ఎప్పటి నుండి అమలుచేస్తారన్న విషయంలో ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన చేయించాలని ఆ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర రాజ ధాని విషయంలో సమగ్ర చర్చకు పట్టుబట్టా లని వైసిపి నిర్ణయించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వ్యూహాలు సిద్ధం శివరామకృష్ణన్‌ కమిటీ కసరత్తు ఇంకా జరుగుతుండగానే రాజధాని విషయంలో ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు చేసిన ప్రకటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆ పార్టీ వ్యూహం రూపొందించింది. విజయవాడను రాజధానిని చేసే విషయాన్ని శాసనసభ వేదికగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి వ్యతిరేకించే అవకాశం ఉందని సమాచారం. రాజధాని విషయంలో సభలో చర్చ జరపాలని, అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని, అవసరమైతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఆ పార్టీ డిమాండ్‌ చేయనుందని తెలిసింది. కీలకమైన బడ్టెట్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను పరిశీలించాలని, సాగునీటి ప్రాజెక్టులు, ఫీజు రీయంబర్స్‌మెంటు, ఇతర సంక్షేమపథకాలకు ఎక్కువ నిధులు కేటాయించేందుకు ఒత్తిడి తేవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దాదాపు రెండు నెలలకు పైగా సాగిన నూతన ప్రభుత్వ పాలన ప్రజల అంచనాలకు తగినట్టుగా లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, అభివృద్ధి విషయంలోనూ ఇప్పటివరకు ఒక్క సానుకూల నిర్ణయం కూడా తీసుకోలేదన్న అభిప్రాయం వైఎస్‌ఆర్‌సిపి శాసనసభపక్ష సమావేశంలో వ్యక్తమైంది. మరోవైపు విపక్ష విమర్శలను తిప్పికొట్టేందుకు అధికారపక్షం కూడా కసరత్తు పూర్తి చేసింది. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అనుభవరాహిత్యాని పదేపదే ఎత్తి చూపుతూ, వారి విమర్శలను తోసిపుచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యూహం సిద్దం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: