నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' ఆడియో ఫంక్షన్ రసాభసగా ముగిసింది. విజయవాడలోని పీవీపీ షాపింగ్ మాల్ లో నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్ లో నాగచైతన్యను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ ఆడియో రిలీజ్ ను చూడటానికి కొన్ని వేల మంది రావడంతో, నిర్వాహకులు ఫంక్షన్ ఆరంభం నుంచే జనాల్ని కంట్రోల్ చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఫంక్షన్ ప్రారంభమైన కొద్ది సేపటికి... జనంలో తోపులాట మొదలై తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు అభిమానుల మీద లాఠీఛార్జి చేయాల్సివచ్చింది.  పరిమితికి మించి అభిమానుల్ని అనుమతించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు నాగచైతన్య లాంటి యువహీరో వస్తున్నాడని తెలిసి కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేయలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ ఫంక్షన్ కోసం కేవలం 10 నుంచి 12 మంది కానిస్టేబుల్స్ ను మాత్రమే పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఈ తొక్కిసలాటలో పీవీపీ షాపింగ్ మాల్ ఫర్నిచర్ తో పాటు, ఓ ఎస్కలేటర్ కూడా దెబ్బతింది.

మరింత సమాచారం తెలుసుకోండి: