సమగ్ర కుటుంబ సర్వేకు ప్రభుత్వం సర్వం సంసిద్దం చేసింది. మంగళవారం చేపట్టనున్న సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 98.91 లక్షల కుటుంబాల సర్వేకు 3.71 లక్షల మంది ఉద్యోగులను ప్రభుత్వం వినియోగిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటలకు సర్వే కొనసాగనుంది.ó మిగిలిన 9 జిల్లాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు సర్వే నిర్వహించనున్నారు. సర్వేకు సంబంధించి హైకోర్టు సైతం గ్రీన్‌ సిగల్‌ ఇవ్వడంతో ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ తీర్పుతో రాజకీయ విమర్శలను సైతం తిప్పి కోట్టేందుకు రెట్టించిన బలం చేకూరడమే కాకుండా సర్వేపై ప్రజలకు ఉన్న అనుమానాలు తీరి సర్వే విజయవంతం కావడానికి దోహద పడు తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన సర్వేకు వివిధ విభాగాల ఉద్యోగుల తో పాటు పోలీసులను కూడా ఎన్యూ మరేటర్లుగా వినియోగించుకుంటోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో దాదాపు 4 వేల మంది పోలీసులు ఎన్యూమరేటర్లుగా జిహెచ్‌ఎంసి కమీషనర్‌ పర్యవేక్షణలో పనిచేయనున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో (20 లక్షలు కుటుంబాలు), ఉద్యోగులు 75 వేలు, రంగారెడ్డి (7.89 లక్షల కుటుంబాలు) 28 వేల ఉద్యోగులు, నల్గొండ (10.42 లక్షల కుటుంబాలు) 35 వేల ఉద్యోగులు, నిజామాబాద్‌ (7.5 లక్షల కుటుంబాలు), 28 వేల ఉద్యోగులు, ఖమ్మం (8.77 లక్షల కుటుంబాలు), 29 వేల ఉద్యోగులు, కరీంనగర్‌ (9.86 లక్షల కుటుంబాలు) ఉద్యోగులు 34 వేలు, వరంగల్‌ (10.15 లక్షల కుటుంబాలు) 43 వేల ఉద్యోగులు, మహబూబ్‌ నగర్‌ (9.74 లక్షల కుటుంబాలు) 39 వేల ఉద్యోగులు, మెదక్‌ (7.56 లక్షల కుటుం బాలు) 30 వేల ఉద్యోగులు, ఆదిలాబాద్‌ (7.47 లక్షల కుటుంబాలు) 30 వేల ఉద్యోగులను వినియో గించనుంది. సర్వే కోసం తెలంగాణ వ్యాప్తంగా ఆర్‌టిసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సర్వేకు వెళ్లే ఎన్యుమరేటర్ల కోసం పలు ప్రాంతాలకు 800 ప్రత్యేక బస్సులు నడపనుంది. సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉదయం, సాయంత్రం వేళ్లల్లో బస్సులు యథాతధంగా నడపనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: