తెలంగాణలో రైతులు రుణమాఫీకాకా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా ముందుకు అడుగు వేయలేదని శ్రీనివాస్ మండిపడ్డారు. కరెంట్ కోతలతో పరిశ్రమలు ముతపడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అంటూనే, మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు కమిటీ వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ విషయంలో ప్రభుత్వం జారీ చేస్తామన్న మార్గదర్శకాలను ఇంతవరకు జారీ చేయలేదని అన్నారు. ప్రజలకు అవసరమైన వాటిని పక్కనపెట్టి, కావాలనే ప్రభుత్వం సమయాన్ని వృధా చేస్తున్నదని డి. శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు చాలా ఉన్నాయని, వెంటనే వాటిని భర్తీ చేయడం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: