ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని విషయాల్లోనూ వెన్నుదన్నుగా వుండే ఐదుగురు నిపుణుల బృందమే ప్రణాళికా సంఘం స్థానంలో నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త బృందానికి మాజీ కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు నాయకత్వం వహిస్తారు. స్వేచ్ఛా మార్కెట్‌ ఆర్ధికవేత్తలు అరవింద్‌ పణగారియా, వివేక్‌ దేవ్‌రారులు మరో ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ మేరకు లాంఛనంగా ప్రకటన వెలువడే అవకాశం వుంది. ఇంకా పేరు నిర్ణయించని, ప్రధానికి సలహాదారుగా వుండే ఈ సంస్థలోని ఇతర ఇద్దరు సభ్యుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన బహుశా ఐఐటిల నుండి వచ్చిన వారు ఒకరు, సామాజిక శాస్త్రాల నిపుణుడు, సంఘ పరివార్‌తో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగిన వ్యక్తి రెండోవారుగా వుంటారని భావిస్తున్నారు. మోడీ ప్రధాని కావడానికి ముందు ఆర్ధికవేత్తలు దేవ్‌రారు, పణగారియాలు ఇద్దరు కూడా మోడీకి సలహా, సూచనలు ఇస్తూ ఆయన కీలక బృందంలో వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: