పార్టీ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ రికార్డు మరెవ్వరకీ సాధ్యం కాదు. క్రమశిక్షణలో, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఆ పార్టీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నా.. వైఎస్ వంటి బలమైన ప్రత్యర్థులు అధికారంలో ఉన్నా.. ఆ పార్టీ క్యాడర్ చెక్కుచెదరలేదు. అధికారంలో ఉన్నా లేకపోయనా.. నియోజకవర్గాల వారీగా నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారవుతాయి. క్రమంతప్పకుండా పార్టీ పరిస్థితిపై సమీక్షలు ఉంటాయి. దటీజ్ టీడీపీ. పార్టీ నిర్వహణలో ఉన్న అపార అనుభవాన్నే ముఖ్యమంత్రిగానూ చంద్రబాబు ఉపయోగిస్తున్నారు. విభజనతో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రపరిస్థితిని చక్కదిద్దుతారన్న నమ్మకంతో అధికారం అప్పగించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే మంత్రుల సామర్థ్యానికి, పాలనాతీరుకు ఎప్పటికప్పుడు పరీక్షలు పెడుతున్నారు. మంత్రుల పనితీరును వివిధ కోణాల్లో పరిశీలించిన చంద్రబాబు వారికి మార్కులు కూడా వేశారు.  చంద్రబాబు పరీక్షలో కొద్దిమంది మాత్రమే పాసయ్యారట. చాలా మంది ఫెయిలయ్యారు. ఓ మంత్రి అత్యధికంగా వందకు 88 మార్కులు తెచ్చుకున్నారు. మరో మంత్రి కేవలం 12 మార్కులతో అట్టడుగున నిలిచారు. చాలా మందికి 35 కంటే తక్కువగానే వచ్చినట్టు సమాచారం. టీడీఎల్పీ సమావేశంలో ఈ విషయాలను చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: